క్రీడాభూమి

అదరగొట్టారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో చెలరేగింది. దీంతో 67 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాటు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌నూ కైవసం చేసుకుంది. అంతకుముం దు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్‌లు చక్కటి శుభారంభం అందించారు. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో జట్టు స్కోరు 5 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. ఒకరితో ఒకరు పోటీగా అన్నట్లు బౌలర్ల ను ఆడుకున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ 29 బంతుల్లో, రోహిత్ 23 బంతుల్లో అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఓవైపు వికెట్ తీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న విండీస్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. అయితే 12వ ఓవర్‌లో నాలుగో బంతికి రోహిత్ శర్మ (71) అవుటయ్యాడు. దీంతో ఈ జోడీకి తెరపడిం ది. మొదటి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 135 పరుగులు జోడించడం విశేషం. రోహిత్ పరుగుల్లో 54 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయ. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ రెండు బంతులను ఎదుర్కొని పొలార్డ్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో 138 పరుగులకు భారత్ 2 వికెట్లను కోల్పోయంది. మరోవైపు లోకేష్ రాహుల్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో జతకట్టి తన అద్భుత ఫాంను కొనసా గించాడు. అయతే వచ్చి రాగానే కోహ్లీ విండీస్‌పై బౌండరీలతో విరుచుపడ్డాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రాహుల్ (91) క్యాచ్ అవుటై త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (70), శ్రేయాస్ అయ్యర్ (0) మరో వికెట్ పడకుండా చివరి వరకు క్రీజులో ఉండడంతో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయ 240 పరుగులు చేసింది. వెస్టిం డీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్, కెస్రిక్ విలియమ్స్, కిరన్ పొలార్డ్ తలో వికెట్ తీసుకున్నారు.
ఆదిలోనే ఎదురుదెబ్బ..
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు 12 పరుగుల వద్ద లెండీ సిమన్ స (7) మొదటి వికెట్‌ను కోల్పోయంది. ఆ తర్వాత కొద్దిసేపటికే బ్రాండన్ కింగ్ (5), నికోలస్ పూరన్ (0) అవుటయ్యారు. దీంతో కరేబియన్ జట్టు 17 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది.
పొలార్డ్ ఒక్కడే..
ఓవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మాత్రం భారత బౌలింగ్‌కు ఏమాత్రం బెదరకుండా తనదైన శైలిలో ఆడాడు. ఈ క్రమంలో పొలార్ డ (68) అర్ధ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్లంతా విఫలమవడం తో విండీస్‌కు పరాజయం తప్పలేదు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లు తలా రెండేసి వికెట్లు తీసుకొని విజయంలో కీలకపాత్ర పోషించారు. మరోవైపు ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది.

స్కోర్ బోర్డు.. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సీ) హెడేన్ వాల్ష్ (బీ) విలియమ్స్ 71, లోకేష్ రాహుల్ (సీ) పూరన్ (బీ) కాట్రెల్ 91, రిషభ్ పంత్ (సీ) హోల్డర్ (బీ) పొలార్డ్ 0, విరాట్ కోహ్లీ (నాటౌట్) 70, శ్రేయాస్ అయ్యర్ (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 8 మొత్తం: 240 (20 ఓవర్లలో 3 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-135, 2-138, 3-233.
బౌలింగ్: షెల్డన్ కాట్రెల్ 4-0-40-1, జాసన్ హోల్డర్ 4-0-54-0, ఖరీ పీర్రే 2-0-35-0, కెస్రిక్ విలియమ్స్ 4-0-37-1, హెడేన్ వాల్ష్ 4-0-38-0, కీరన్ పొలార్డ్ 2-0-33-1.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: లెండి సిమ్మన్స్ (సీ) శ్రేయాస్ అయ్యర్ (బీ) షమీ 7, బ్రాండన్ కింగ్ (సీ) రాహుల్ (బీ) భువనేశ్వర్ 5, షిమ్రాన్ హెట్మాయర్ (సీ) రాహుల్ (బీ) కుల్దీప్ యాదవ్ 41, నికోలాస్ పూరన్ (సీ) శివమ్ దూబే (బీ) డీ చాహర్ 0, కీరన్ పొలార్డ్ (సీ) రవీంద్ర జడేజా (బీ) భువనేశ్వర్ 68, జాసన్ హోల్డర్ (సీ) మనీష్ పాండే (బీ) కుల్దీప్ యాదవ్ 8, హెడేన్ వాల్ష్ (బీ) షమీ 11, ఖరీ పెర్రీ (సీ) రవీంద్ర జడేజా (బీ) డీ చాహర్ 6, కెస్రిక్ విలియమ్స్ (నాటౌట్) 13, షెల్డన్ కాట్రెల్ (నాటౌట్) 4.
ఎక్స్‌ట్రాలు: 10 మొత్తం: 173 (20 ఓవర్లలో 8 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-12, 2-17, 3-17, 4-19, 5-103, 6-141, 7-152, 8-169.
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-20-2, భువనేశ్వర్ కుమార్ 4-0-41-2, మహ్మద్ షమీ 4-0-25-2, శివమ్ దూబే 3-0-32-0, కుల్దీప్ యాదవ్ 4-0-45-2, వాషింగ్టన్ సుందర్ 1-0-5-0.

*చిత్రాలు.. *రోహిత్ శర్మ (71)
*విరాట్ కోహ్లీ (70, నాటౌట్)
*లోకేష్ రాహుల్ (91)