క్రీడాభూమి

లావోస్‌పై భారత్ ఘనవిజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, జూన్ 7: మూడేళ్ల తర్వాత జరుగే ఎఎఫ్‌సి ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్-2019లో భారత జట్టుకు బెర్తు ఖరారైంది. రెండో లెగ్ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి ఇందిరా గాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 6-1 గోల్స్ తేడాతో లావోస్ జట్టును మట్టికరిపించి ఈ బెర్తును ఖరారు చేసుకుంది. ఇప్పటివరకూ భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. భారత స్ట్రైకర్ జేజే లాల్‌పెఖులా అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ సాధించి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 16వ నిమిషంలో లావోస్‌కు ఖొనేసవానా సిహవోంగ్ గోల్‌ను అందించడంతో మ్యాచ్ ఆరంభంలో కాస్త వెనుకబడిన భారత్ ఆ తర్వాత గణనీయంగా పుంజుకుని ఆద్యంతం పూర్తి ఆధిపత్యంతో సత్తా చాటుకుంది. ముఖ్యంగా జేజే లాల్‌పెఖులా 42, 74 నిమిషాల్లో భారత జట్టుకు రెండు గోల్స్ సాధించిపెట్టగా, 45వ నిమిషంలో సుమీత్ పస్సీ, 49వ నిమిషంలో సందేశ్ జింగన్, 83వ నిమిషంలో మహ్మద్ రఫీక్, 87వ నిమిషంలో కొత్త ఆటగాడు ఫుల్గాంకో కార్డోజో ఇతర గోల్స్ అందించారు. వీటిలో మూడు గోల్స్ కేవలం 7 నిమిషాల వ్యవధిలో నమోదు కావడం విశేషం. ఈ నెల 2వ తేదీన వియెంటియానేలో లావోస్‌తో జరిగిన తొలి లెగ్ మ్యాచ్‌లో 0-1 గోల్ తేడాతో విజయం సాధించిన భారత జట్టు తాజాగా స్వదేశంలో మరోసారి 6-1 గోల్స్ తేడాతో ప్రత్యర్థులను ఓడించడంతో మొత్తం మీద ఈ రెండు మ్యాచ్‌లలో 7-1 గోల్స్ తేడాతో విజయం సాధించినట్లయింది.