క్రీడాభూమి

టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్) : టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవడం మంచిదని, అయితే తుది నిర్ణయం మేనేజ్‌మెంట్‌దేనని భారత్ జట్టు బౌలర్ దీపక్ చాహర్ అన్నాడు. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన చాహార్ విలేఖరులతో మాట్లాడుతూ గాయాల కారణంగా తాను చాలాసార్లు భారత్ జట్టులో స్థానం చేజార్చుకున్నానన్నాడు. ప్రతీ మ్యాచ్‌లో బౌలర్లు రాణించడం కష్టమని, భారత్ జట్టు తొలి వనే్డలో 287 పరుగులు చేసినా వెస్టిండీస్ రాణించడంతో ఓటమి తప్పలేదన్నాడు. గత మ్యాచ్‌లో పిచ్ బౌలింగ్‌కు అనుకూలించలేదన్నాడు. భారత్ ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాలు మరింత బలపడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఓవర్లలో చాలా వ్యత్యాసంతో బౌలింగ్ చేయాల్సి ఉంటుందని, ఇపుడిపుడే ఎలా బౌలింగ్ చేయాలో నేర్చుకుంటున్నానన్నాడు. గత రెండేళ్ల నుంచి తన బౌలింగ్‌లో చాలా వ్యత్యాసాన్ని తీసుకురాగలిగానని, యార్కర్ వేయడంలో కొంతమేర మెరుగుపడ్డానన్నాడు. చిన్నప్పటి నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయాలని ఉండేదని, అయితే ప్రస్తుతం 135, 137 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వేయగలుగుతున్నానన్నాడు. వైట్‌బాల్‌తో కంటే రెడ్ బాల్‌తో స్వింగ్ చేయడం సులభమని, వైట్‌బాల్‌తో స్వింగ్ చేయాలంటే బంతితోనే కాకుండా బాడీ యాక్షన్‌తో కూడా స్వింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు. వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌లో చాలా పటిష్టంగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు.
రెండు జట్ల ముమ్మర సాధన
బుధవారం జరిగే రెండో వనే్డలో తలపడుతున్న భారత్, వెస్టిండీస్ జట్లు మంగళవారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ముమ్మరంగా సాదన చేసాయి. భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మ ప్రాక్టీస్‌కు రాలేదు. మిగిలిన బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్, జడేజా, రిషబ్‌పంత్ నెట్స్‌లో ఎక్కువసేపు సాధన చేశారు. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, కులదీప్ యాదవ్, దీపక్ చాహార్ నెట్స్‌లో చెమటోడ్చారు. వెస్టిండీస్ జట్టు ఉదయం తొమ్మిది గంటల నుంచి 12 గంటల వరకు ఫిట్‌నెస్‌తోపాటు బ్యాటింగ్, బౌలింగ్‌లో శ్రమించింది. ఇదిలా ఉండగా భారత జట్టులో లేనప్పటికీ బుమ్రా, పృథ్వీషా నెట్స్‌కు హాజరై కొద్ది సేపు సాధన చేశారు. తుది జట్టులో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం లేకపోలేదు.
*చిత్రం.... నెట్ సలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా