క్రీడాభూమి

రికార్డులే రికార్డులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 18: ఈ ఏడాది అత్యధికంగా 77 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన తన రికార్డులను తానే అధిగమించాడు. 2019 లో రోహిత్ 77 సిక్సర్లు కొట్టగా, 2018లో (74), 2017లో 65 సిక్సర్లు సాధించి, వరుసగా మూడేళ్లు మొదటి స్థానం లో నిలిచాడు. ఈ ఏడాది రోహిత్ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (60) ఉన్నాడు. 2015లో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ (63) సిక్సర్లు కొట్టాడు.
ఈ వనే్డలో చేసిన స్కోరుతో భారత జట్టు వెస్టిం డీస్‌పై రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. 2011లో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు కోల్పోయ 418 పరుగులు చేసింది. విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు నష్టపోయ 387 పరుగులు చేయడంతో రెండో అత్యధిక స్కోరు సాధించినట్లయంది.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ కలిసి ఒకే ఓవర్‌లో 31 పరుగులు రాబట్టారు. వనే్డల్లో ఒక ఓవర్‌లో భారత్‌కి ఇదే అత్యధిక స్కోరు. ఇంతకుముందు 1999లో హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, అజయ్ జడేజా చేసిన 28 పరుగులే అత్యధికంగా ఉండేవి. 2000లోనూ జింబాబ్వేపై జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్ 27 పరుగులు చేశారు.
విండీస్‌తో జరిగిన రెండో వనే్డలో రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ చేసిన 227 పరుగులు వనే్డలో భారత్‌కు నాలుగో అత్యధిక భాగస్వామ్యంగా నిలిచాయ. 2001లో కెన్యా జట్టుపై సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ చేసి 258 పరుగులే ఇప్పటికీ అత్యధిక భాగస్వామ్యంగా ఉన్నాయ. అంతకుముందు 1998లో ఇదే జోడీ శ్రీలంకపై 252 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. 2014లో శిఖర్ ధావన్, అజింక్యా రహానే శ్రీలంకపై 231 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

*చిత్రం... శ్రేయాస్ అయ్యర్ (53)