క్రీడాభూమి

పాట్ కమిన్స్‌కు 15.5 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌కు సంబంధించిన వేలం ముగిసింది. కోల్‌కతా వేదికగా గురువారం జరిగిన ఈ వేలంలో ఎనిమిది జట్లకు చెందిన ఫ్రాంచైజీలు తమ సిబ్బంది సహా పాల్గొన్నాయ. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన వేలం రాత్రి 9.20 గంటలకు ముగిసింది. ఫ్రాంచైజీలు మొత్తం 62మందిని కొనుగోలు చేశాయ. ఈసారి జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మంచి ధర పలకగా, చాలామంది ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. 2020 సీజన్‌కు సంబంధించి ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యధిక మొత్తం ధర పలికిన విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2017లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ ఫ్రాంచైజీ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను 14.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, కమిన్స్‌కు 15.50 కోట్ల రూపాయలు చెల్లించి కోల్‌కతా నైట్ రైడర్స్ కొనింది. ఆసీస్‌కే చెందిన ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్ 10.75 కోట్ల రూపాయలతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు వెళ్లగా, దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌కు 10 కోట్ల రూపాయలు లభించాయి. అతనిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. వెస్టిండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్ 8.5 కోట్ల రూపాయల ధరతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు తరలి వెళ్లాడు. నాథన్ కౌల్టర్ నైల్ (ఆసీస్)ను 8 కోట్ల రూపాయలతో ముంబయి ఇండియన్స్ కొనింది. షిమ్రన్ హాత్‌మేయర్ (వెస్టిండీస్) 7.75 కోట్ల రూపాయలతో ఢిల్లీ కేపిటల్స్ సొంతమయ్యాడు. భారత స్పిన్నర్ పీయూష్ చావ్లాకు చెన్నై సూపర్ కింగ్స్ 6.75 కోట్ల రూపాయలు చెల్లించింది. శామ్ క్యూరెన్ (ఇంగ్లాండ్) 5.50 కోట్ల రూపాయలతో చెన్నై సూపర్ కింగ్స్‌కే దక్కాడు. ఇంగ్లాండ్‌కే చెందిన ఇయాన్ మోర్గాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 5.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మార్కస్ స్టొయినిస్ (ఆస్ట్రేలియా) 4.80 కోట్లతో ఢిల్లీ కేపిటల్స్‌కు దక్కాడు. వేలంలో అమ్ముడైన ఆటగాళ్లలో ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా/4.4 కోట్లు/ రాయల్ చాలెంజర్స్ బెంగళూ రు), వరుణ్ చక్రవర్తి (్భరత్/ 4 కోట్లు/ కోల్‌కతా నైట్ రైడర్స్), కేన్ రిచర్డ్‌సన్ (న్యూజిలాండ్/ 4 కోట్లు/ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), జైదేవ్ ఉనాద్కత్ (్భరత్/ 3 కోట్లు/ రాజస్థాన్ రాయల్స్), రాబిన్ ఉతప్ప (్భరత్/ 3 కోట్లు/ రాజస్థాన్ రాయ ల్స్), క్రిస్ జోర్డాన్ (ఇంగ్లాండ్/ 3 కోట్లు/ కింగ్స్ ఎలెవెన్ పంజా బ్), యశస్వి జైస్వాల్ (్భరత్/ 2.5 కోట్లు/ రాజస్థాన్ రాయ ల్స్), అలెక్స్ కారీ (ఆస్ట్రేలియా/ 2.4 కోట్లు/ ఢిల్లీ కేపిటల్స్), జొస్ హాజెల్‌వుడ్ (ఆస్ట్రేలియా/ 2 కోట్లు/ చెన్నై సూపర్ కింగ్స్), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా/ 2 కోట్లు/ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా/ 2 కోట్లు/ సన్‌రైజర్స్ హైదరాబాద్), రవి బిష్ణోయ్ (్భరత్/ 2 కోట్లు/ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), క్రిస్ లీన్ (వెస్టిండీస్/ 2 కోట్లు/ ముంబయి ఇండియన్స్), విరాట్ సింగ్ (్భరత్/ 1.9 కోట్లు/ సన్‌రైజర్స్ హైదరాబాద్), ప్రియం గర్గ్ (్భరత్/ 1.9 కోట్లు/ సన్‌రైజర్స్ హైదరాబాద్) తదితరులు ఉన్నారు.
అవకాశం దక్కని స్టార్లు..
ఈసారి ఐపీఎల్ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్లకు అవకాశం దక్కలేదు. ఫ్రాంచైజీలు ఏవీ ఆసక్తి చూపని క్రికెటర్ల జాబితాలో టిమ్ సౌథీ, కార్లొస్ బ్రాత్‌వెయిట్, ఆడం జంపా, ఎవిన్ లూయిస్, మార్టిన్ గుప్టిల్ తదితరులు ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ చెరి ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లను తీసుకున్నారు. దీంతో ఆ రెండు ఫ్రాంచైజీల్లో విదేశీ క్రికెటర్ల కోటా పూర్తయింది. ఢిల్లీ కేపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వద్ద తలా ఏడుగురు విదేశీ క్రికెటర్లు ఉన్నారు. దీనితో ఈ ఫ్రాంచైజీలకు ఇంకా ఒక్కో విదేశీ ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇద్దరు, రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నలుగురు చొప్పున విదేశీ క్రికెటర్లను తీసుకోవచ్చు.