క్రీడాభూమి

నేనున్నా.. ఈసారి ట్రోఫీ ఆర్సీబీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్నస్‌బర్గ్, డిసెంబర్ 21: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ కచ్చితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుదేనని దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయన్ అన్నాడు. ఇటీవల జరిగిన 13వ సీజన్ వేలంలో చివరి నిమిషంలో స్టెయన్‌ను ఆర్సీబీ కనీస ధర రూ.2కోట్లకే చేజిక్కించు కున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా గాయాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్టెయన్‌కు ఇది ఊరటనిచ్చిందనే చెప్పాలి. దీనిపై స్టెయన్ ఆనందం వ్యక్తం చేశాడు.
అయతే సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని ‘ఈసారైనా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీని సాధిస్తుందా?’ అని అడిగిన ప్రశ్నకు స్టెయన్ సమాధానమిస్తూ ‘తప్పకుండా సాధిస్తుంది. ఎందుకంటే జట్టులో నేనున్నా’నంటూ సమాధానమిచ్చాడు. గత సీజన్‌లోనూ ఆర్సీబీ తరఫున ఆడిన స్టెయన్ గాయం కారణంగా కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సీజన్‌కు స్టెయన్‌ను వేలంలో పెట్టింది. అయతే చివరి వర కూ స్టెయన్ అమ్ముడుపోకపోగా, చివరికి కనీస ధర రూ.2 కోట్లు పెట్టి ఆర్సీబీనే కొనుగోలు చేసింది. ఇదిలావుంటే టీమిండియా గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా బౌలింగ్ బాగుందన్నాడు.