క్రీడాభూమి

మసూద్, అబిద్ సెంచరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, డిసెంబర్ 21: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 57/2 పరుగులతో మూడో రోజు రెండో ఇన్నింగ్ సకు దిగిన పాక్ ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చా రు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 278 పరుగుల భాగస్వామ్యాన్ని అం దించారు. ఈ క్రమంలో షాన్ మసూ ద్ (135) లహీరు కుమార బౌలింగ్‌లో ఒషాడ ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ అబిద్ అలీ (174) త్రుటిలో డబుల్ సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు. లహీరు కుమార వేసిన అద్భుత బంతికి ఎల్బీగా అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అజా ర్ అలీ (57, నాటౌట్) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, బాబర్ అజామ్ (22, నాటౌట్) క్రీజులో కొనసాగుతున్నా రు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ ఓపెనర్లిద్దరినీ కోల్పోయ 395 పరుగులు చేసింది. దీంతో 315 పరుగుల భారీ ఆధిక్యా న్ని సంపాదించింది.
మ్యాచ్‌కు మరో రెండు రోజులు సమయం ఉండడం తో ఫలితం తేలే అవకాశముంది. శ్రీలంక బౌలర్లలో లహీరు కుమారకు మాత్రమే రెండు వికెట్లు దక్కాయ.
*అబిద్ అలీ (135)
*షాన్ మసూ ద్ (135)