క్రీడాభూమి

గెలిస్తే చరిత్రే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్: భారత్-వెస్టిండీస్ మధ్య నేడు జరిగే చివరి వనే్డ ఆసక్తి రేపుతోంది. కోహ్లీసేన సులువుగానే సిరీస్ గెలుస్తుందని భావించినా, మొదటి వనే్డలో అద్భుత ప్రదర్శనతో వెస్టిండీ స్ విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్‌తో తేరుకున్న టీమిండి యా 107 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్‌ను సమం చేసింది. దీంతో చివరిదైన మూడో వనే్డను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ. అంతకుముందు స్వదేశంలో భారత్‌పై ఘోర పరాజయం పాలైన కరేబియన్ జట్టు భారత్ పర్యటనలో ప్రతీకారం తీర్చుకునేలా కనిపించింది. అయతే అనూహ్యాంగా టీ20 సిరీస్‌ను ఓడిపోయంది. విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మాత్రం తామింకా పూర్తిగా ఓడిపోలేదని, వనే్డ సిరీస్ కూడా ఉందని ఆటగాళ్లను ఉత్తేజపరిచాడు. అయతే ఈ విషయంలో పొలార్డ్ వ్యాఖ్యాలు పనిచేశాయ. చెన్నైలో జరిగిన మొదటి వనే్డలో విండీస్ ఓపెనర్లు సెంచరీలతో చెలరేగి ఆడడంతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయతే విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వనే్డలో షై హోప్, నికోలస్ పూరన్‌లు మాత్రమే అర్ధ సెంచరీలతో ఆకట్టుకోవడంతో వెస్టిండీస్ ఛేదనలో డీలా పడిపోయా 107 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. దీంతో చివరి మ్యాచ్‌లో కరీబియన్ల పోరా టం ఎలా ఉండబో తుందనేది ఆసక్తిగా మారింది.
కోహ్లీ రాణించేనా..?
టీమిండియా కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ వనే్డ సిరీస్‌లో ఇప్పటివరకు చెప్పుకోదగిన స్కోర్లు చేయలేదు. మొదటి మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ, రెండో వనే్డలో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో నేడు జరిగే చివరి మ్యాచ్‌లో విరాట్ రాణిస్తే భారత జట్టు టాప్ ఆర్డర్ మరింత బలపడనుంది. గత మ్యాచ్ లో సెంచరీలతో రాణించిన ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫాంలో ఉండడం, నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత రిషభ్ పంత్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజాలతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. మరోవైపు బౌలింగ్ విభాగంలో పేసర్ మహ్మద్ షమీతో పాటు, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లు రాణించడం కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లను తీసిన భారత బౌలర్‌గా కుల్దీప్ యాదవ్ నిలిచాడు. నేడు జరిగే మ్యాచ్‌లోనూ కుల్దీప్ కీలకంగా మారను న్నాడు. ఇదిలాఉంటే మరో పేసర్ దీపక్ చాహర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అయతే అతడి స్థానంలో జట్టు యాజమాన్యం నవదీప్ సైనీని తీసుకుంది. అయతే సిరీస్‌కు ముందే భారత పేసర్లు జస్పీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ గాయాల పాలైన విషయం తెలిసిందే.
యువ ఆటగాళ్లు అదుర్స్..
మరోవైపు ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లయన శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్‌లు ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. శ్రేయాస్ అయతే ఎంతో పరిణితి చెందిన ఆటగాడిలా పరుగులు చేయడం, అందులోనూ నాలుగో స్థానంలో రాణించడంతో జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. అయ్యర్ ఆట తీరుతో ఇక భారత జట్టుకు నాలుగో స్థానం బెంగ తీరినట్లేనని మాజీలు సైతం పేర్కొంటున్నాడు. ఇక తరుచూ ఒకే తరహా అవుటై విమర్శల పాలవుతున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సైతం రెండు మ్యాచ్‌ల్లోనూ ఫర్వాలేదనిపించాడు. మొదటి మ్యాచ్‌లో పెద్దగా స్కోరు చేయకపోయనా, అతడు చేసిన పరుగులే జట్టు భారీ స్కోరుకు కారణమయ్యాయ. రెండో వనే్డలో కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేసి శెభాష్ అనిపించుకున్నాడు. వీరిద్దరితో పాటు లోకేష్ రాహుల్ సైతం గత కొద్దిరోజులుగా ఆకట్టుకునే ప్రదర్శనలు చేస్తున్నాడు. రెగ్యూలర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కూడా రాహుల్‌కు ఒక రకంగా కలిసొచ్చిందనే చెప్పాలి. గత మ్యాచ్‌లో రోహిత్‌ను మించి హిట్టింగ్ చేయడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇదిలాఉంటే నేడు జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం సాధిస్తే టీమిండియా అరుదైన రికార్డును అందుకోనుంది. వరుసగా 10 ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డుకెక్కనుంది. మరోవైపు విండీస్ సైతం చివరి వనే్డలో గెలిస్తే 13 ఏళ్ల తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌ను గెలుచున్నట్లవుతుంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.