క్రీడాభూమి

నిర్ణయం బిసిసిఐదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 7: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు సారథిగా తన భవితవ్యంపై వస్తున్న ఊహాగానాలను ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ తోసిపుచ్చాడు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డేనని అతను మరోసారి స్పష్టం చేశాడు. ‘నేను ఆటను ఆస్వాదించడం లేదనడం సరికాదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు నేను నాయకత్వం వహించాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయించాల్సింది నేను కాదు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డే’ అని మంగళవారం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు బయల్దేరబోయే ముందు ముంబయిలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ధోనీ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోనీ అంతర్జాతీయ వనే్డలు, ట్వంటీ-20 మ్యాచ్‌లలో భారత జట్టుకు సారథిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అన్ని ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టుకు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సారథ్యం వహించాలని, కెప్టెన్సీ నుంచి ధోనీకి విముక్తి కల్పించి అతను ఆటను ఆస్వాదించేందుకు వీలుకల్పించాలని టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్ర్తీ ఇటీవల వ్యక్తం చేసిన అభిప్రాయంపై స్పందిస్తూ ధోనీ పై విషయాన్ని స్పష్టం చేశాడు.
భాష సమస్యే కాదు..
ఇదిలావుంటే, భారత జట్టుకు కొత్త కోచ్‌ను నియమించడంలో హిందీ భాషపై మంచి పట్టు ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తామని బిసిసిఐ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కోచ్ ఎలా ఉండాలని ఆకాంక్షిస్తున్నారని విలేఖర్లు ప్రశ్నించగా, భాష సమస్య కాదని, కోచ్‌లు ఇంగ్లీషు భాషలో మాట్లాడటం వలన కొత్త ఆటగాళ్లకు ఇబ్బందులేమీ లేవని ధోనీ చెప్పాడు. భారత జట్టుకు తదుపరి కోచ్‌గా నియమితుడయ్యే వ్యక్తికి హిందీ భాషలో ప్రావీణ్యం లేకపోయినప్పటికీ ఇక్కడి సంస్కృతిపై మంచి అవగాహన ఉంటే సరిపోతుందని ధోనీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.