క్రీడాభూమి

అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ @ 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: టీమిండియాకు రెండుసార్లు వరల్డ్ కప్‌లను అందించిన మాజీ కెప్టెన్ ఎం.ఎస్.్ధనీ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టి సోమవారం నాటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘకాలంలో ఈ రాంచీ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ ధోనీ ఇటు జట్టు సారథిగా, అటు బ్యాట్స్‌మన్‌గా, మరోపక్క వికెట్ కీపర్‌గా కీలక పాత్రలను పోషించి, ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. 2004లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో బంగ్లాదేశ్‌తో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగిడిన ధోనీ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 17,266 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల ఈ వికెట్ కీపర్ తన కెరీర్‌లో 350 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 90 టెస్టు మ్యాచ్‌లు, 98 టీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాకుండా 829 వికెట్లు పడగొట్టాడు. 2011లో ధోనీ సారథ్యంలోని టీమిండియా వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ధోనీ సారథ్యంలోని భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మూడు మేజర్ ఐసీసీ ట్రోఫీలను గెల్చుకుంది. 2007లో టీ 20 వరల్డ్ కప్, 2013లో చాంపియన్ ట్రోఫీని సైతం భారత్ కైవసం చేసుకోవడంలోని ఘనతలో ధోనీ పాత్ర ఎంతో ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇటు టెస్టు మ్యాచ్‌లలో, అటు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో టీమిండియా అగ్రస్థానంలో నిలబడేందుకు చేసిన కృషిలో ధోనీ కృషి ఎనలేనిది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించడం ద్వారా మూడుసార్లు టైటిళ్లను గెల్చుకోవడంతోపాటు చాంపియన్స్ లీగ్ ట్వంటీ విజయంలో కూడా ధోనీ పాత్రను ఎవరూ మరచిపోలేరు.
ఈ ఏడాది జూలైలో న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌లో అర్ధ శతకం సాధించిన తర్వాత క్రికెట్‌కు తాత్కాలికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘వచ్చే ఏడాది జనవరి వరకు నన్ను ఏమీ అడక్కండి’ అంటూ ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించిన ఈ మాజీ కెప్టెన్ 2020 ఐపీఎల్ సీజన్‌లో మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తప్పనిసరిగా విజయాన్ని అందిస్తాడని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు.

'చిత్రం...మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ