క్రీడాభూమి

భవిష్యత్‌లో జడేజా ఎంతో కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సౌరవ్ గంగూలీ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆటతీరును ప్రశంసాపూర్వకంగా అభినందించాడు. వెస్టిండీస్‌తో కటక్‌లో ఆదివారం జరిగిన ఆఖరి, మూడో వనే్డ ఇంటర్నేషనల్ కీలక మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయం సాధించడంలో జడేజా పోషించిన పాత్ర ఎంతో మెచ్చుకోదగినదని గంగూలీ పేర్కొన్నాడు. భవిష్యత్‌లో టీమిండియాకు ఆల్‌రౌండర్‌గా జడేజా ఎంతో ఉపకరిస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 31 బంతులు ఎదుర్కొన్న జడేజా 39 పరుగులతో నాటౌట్‌గా నిలవడం ద్వారా భారత్ గెలుపులో సమర్థవంతమైన పాత్రను పోషించాడు. టీమిండియా గెలుపులో కీలక భూమిక పోషించిన జడేజాను గంగూలీ అభినందించాడు. కెరీర్ ప్రారంభంలో ఆచితూచి ఆడే జడేజా గత కొనే్నళ్లుగా ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడని అన్నాడు. కాగా, కీలకమైన వనే్డ మ్యాచ్‌లో పరిణితి చెందిన తన ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను బీసీసీఐ అభినందనలు తెలిపింది. వనే్డల్లో జడేజా ఇప్పటివరకు రెండు వేల పైచిలుకు పరుగులు, టెస్టుల్లో 1844 పరుగులు చేశాడు. 11 వనే్డలు, 14 టెస్టు మ్యాచ్‌లలో జడేజా ఒక శతకం తోపాటు 25 అర్థ సెంచరీలు నమోదు చేశాడు.
'చిత్రం... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ