క్రీడాభూమి

ఐసీసీ వనే్డ ర్యాంకింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: ఐసీసీ సోమవారం తాజాగా ప్రకటించిన వనే్డ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచారు. వెస్టిండీస్‌తో ఆదివారం కటక్‌లో జరిగిన మూడో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 2-1తో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ తమ తమ స్థానాలను పదిలపరచుకున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి వనే్డలో ఓపెనర్‌గా దిగిన రోహిత్ శర్మ 63 పరుగులు చేశాడు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు (2442) చేయడం ద్వారా శ్రీలంక బ్యాట్స్‌మన్ సనత్ జయసూర్య పేరిట (1997లో 2387 పరుగులు) గత 22 ఏళ్లుగా ఉన్న రికార్డును తిరగరాశాడు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి వనే్డలో విరాట్ కోహ్లీ అత్యధికంగా 85 పరుగులు చేయడం ద్వారా ఈ ఏడాది అతను ఆడిన అన్ని ఫార్మాట్లలో కలిపి 2455 పరుగులు సాధించాడు. వరల్డ్ కప్‌లో ఐదు శతకాలు చేసిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిట ఉంది.
''చిత్రాలు.. విరాట్ కోహ్లీ *రోహిత్ శర్మ