క్రీడాభూమి

మళ్లీ విరాటే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, డిసెంబర్ 24: భారత కెప్టెన్, రన్ మిషన్ విరాట్‌కోహ్లీ టెస్టుల్లో తన టాప్ స్థానాన్ని కాపాడుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 928 రేటింగ్ పాయంట్లతో మొదటిస్థానంలో కొనసాగు తుండగా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 17 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఇక 864 పాయంట్లతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, 791 పాయింట్లతో టీమిండియా టెస్ట్ స్పెషలి స్ట్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా, ఇటీవల వరుస సిరీస్‌ల్లో రాణి స్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూషేన్ 786 పాయింట్ల తో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. శ్రీ లంకతో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించిన పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్ మూడు స్థానాలు మెరుగు పరు చుకొని 767 పాయింట్లతో 6వ స్థానం, టీ మిండియా ఆటగాడు అజింక్యా రహానే ఒక స్థానం దిగజారి759 పాయంట్లతో 7వ స్థా నానికి పరిమితమయ్యాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్రే టలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (755), ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ (752), న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (714) పాయింట్లతో టాప్-10లో చోటు దక్కించు కున్నారు.
ఇక బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ 898 రేటింగ్ పాయంట్లతో మొదటి స్థానం దక్కించుకోగా, దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబద 834 పాయంట్ల రెండో స్థానం, న్యూజిలాండ్ పేసర్ నెల్ వాగ్నార్ 834 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్ 830 పాయంట్లతో నాలుగో స్థానం, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్ 806 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. భారత్ నుంచి జస్ప్రీత్ బుమ్రా 794 పాయంట్లతో 6వ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత వరుసగా జోష్ హజెల్‌వుడ్ (785, ఆస్ట్రేలియా), వెర్నర్ ఫీలాండర్ (783, దక్షిణాఫ్రికా), జేమ్స్ అండర్సన్ (782 ఇంగ్లాండ్), టిమ్ సౌథీ (780, న్యూజిలాండ్) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఇక ఆల్‌రౌండర్లలో భారత్ నుంచి ఏ ఆటగాడికి చోటు దక్కలేదు.