క్రీడాభూమి

ఐపీఎల్‌లో తప్పకుండా రాణిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, డిసెంబర్ 24: ఈసారి ఐపీఎల్‌లో తప్పకుం డా మంచి ప్రదర్శన చే స్తానని ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో అందరికంటే అత్యధికంగా రూ.15.5 కోట్లకు కమిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కమిన్స్‌తో పాటు ఆస్ట్రేలియాకే చెందిన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 10.75 కోట్లకు దక్కించుకుంది. న్యూజిలాండ్‌తో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ముందు కమిన్స్ విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ వేలంలో దక్కించుకున్న డబ్బులతో ఏం చేస్తారని అడగ్గా, ఇంకా తాను ఏం ప్లాన్ చేసుకోలేదని సమాధాన మిచ్చాడు. అయతే తన గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తమ కుక్కలకు మరి కొన్ని బొమ్మలు కొనేలా ప్లాన్ చేస్తున్నట్లు వివరించాడు.