క్రీడాభూమి

కొత్త కొత్తగా.. జింబాబ్వే పర్యటనపై ‘కెప్టెన్ కూల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 7: జింబాబ్వేలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లో పలువురు యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు నాయకత్వం వహించనున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆ సవాలును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండా యువ ఆటగాళ్లతో కొత్త రూపాన్ని సంతరించుకున్న భారత జట్టుకు జింబాబ్వే పర్యటనలో ధోనీ సారథ్యం వహించనున్నాడు. ఈ పర్యటనకు ఎంపికైన పలువురు ఆటగాళ్లతో కలసి ధోనీ ఆడనుండటం ఇదే తొలిసారి. ఇది తనకు చాలా కొత్త అనుభూతిని కలిగిస్తోందని భారత జట్టు మంగళవారం జింబాబ్వేకి బయలుదేరే ముందు ముంబయిలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ధోనీ చెప్పాడు. ‘జింబాబ్వే పర్యటనకు వెళ్తున్న భారత జట్టులో చాలా మంది కొత్త ఆటగాళ్లే. వీరితో నేను కలసి ఆడనుండటం ఇదే తొలిసారి. కనుక వీరి శక్తిసామర్ధ్యాలు ఏమిటో తెలుసుకుని ఈ పర్యటనలో వీరు పోషించాల్సిన పాత్రలు, నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏమిటన్న దానిపై అవగాహనకు రావడంతో పాటు జట్టు కూర్పు ఎలా ఉండాలి?, ఏ ఆటగాడని ఏ స్థానంలో దించితే ఉత్తమ ఫలితాలను రాబట్టుకోవచ్చన్న దానిపై నేను త్వరగా అంచనాకు వచ్చి తదనుగుణంగా జట్టును ముందుకు నడిపించాల్సి ఉంది. ఇదంతా ఎంతో కొత్త అనుభూతిని కలిగిస్తోంది. అయితే ఈ జట్టు, సభ్యుల కూర్పు ఎంతో బాగుంది’ అని ధోనీ పేర్కొన్నాడు. ఈ నెల 11 నుంచి 22వ తేదీ వరకు కొనసాగే ఈ పర్యటనలో ధోనీ సేన జింబాబ్వేతో మూడు మూడు అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లతో పాటు మరో మూడు ట్వంటీ-20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ జింబాబ్వే రాజధాని హరారేలోనే జరుగుతాయి. పూర్తిగా పగటిపూట మాత్రమే జరిగే ఈ మ్యాచ్‌లలో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని ధోనీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘క్రికెట్‌లో టాస్ కీలక పాత్ర పోషించే వేదికల్లో జింబాబ్వే ఒకటి. ప్రస్తుతం పగటిపూట మ్యాచ్‌లు ఆడదగిన ప్రదేశాలు పెద్దగా లేకపోయిన్పటికీ ఇటువంటి మ్యాచ్‌లలో టాస్ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. తద్వారా పరిస్థితులను ఆకళింపు చేసుకుని వాటిని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలవుతుంది’ అని ధోనీ పేర్కొన్నాడు. కాగా, జింబాబ్వే పర్యటనకు వెళ్తున్న భారత జట్టులో బ్యాటింగ్ విభాగం కంటే బౌలింగ్ విభాగానికే అంతర్జాతీయ అనుభవం ఎక్కువగా ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. ‘్భరత జట్టు బౌలింగ్ విభాగం పేపర్‌పై చాలా చక్కగా కనిపిస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, బరీందర్ సరన్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహాల్, జయంత్ యాదవ్ తమ ప్రతిభను ఎంతో మెరుగుపర్చుకున్నారు. వాస్తవానికి వీరంతా యువ ఆటగాళ్లే అయినప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆరితేరినవారే’ అని ధోనీ అన్నాడు.
ఇక బ్యాటింగ్ విభాగం ఎంత మేరకు రాణించగలుగుతుందన్న విషయం ఏ ఆటగాడికి ఏ స్లాట్ లభిస్తుందన్న దానిపై ఆధారపడి ఉంటుందని ధోనీ చెప్పాడు. భారత జట్టులో ఆడేందుకు ముందుకు వచ్చినప్పుడు మనకు ఇష్టమైన స్లాట్ మనకు లభించదని, ఆటతో పాటు పరిస్థితులను ఆకళింపు చేసుకుని ఎవరికి వారు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని అందులో నిలదొక్కుకోవాల్సిందేనని ధోనీ స్పష్టం చేస్తూ, ఏది ఏమైనప్పటికీ బ్యాటింగ్ విభాగం కూడా బాగానే ఉందన్నాడు.