క్రీడాభూమి

ఆస్ట్రేలియాదే సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, డిసెంబర్ 29: అనుకున్నట్లుగానే సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా 247 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 137/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కంగారూలు మరో 31 పరుగులు జోడించిన తర్వాత, వికెట్ కోల్పోయ 168 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 487 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 31 పరుగు ల వద్ద ఓపెనర్ టామ్ లాథమ్ (8) వికెట్‌ను కోల్పోయంది. జేమ్స్ ప్యాటిన్సన్ వేసిన బంతిని అంచనా వేయలేకపోయన లాథమ్ వికెట్ కీపర్ పైన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో పరుగుకే కెప్టెన్ కేన్ విలియమ్సన్ (0), రాస్ టేలర్ (2) జేమ్స్ ప్యాటిన్సన్ బౌలింగ్‌లోనే అవుట య్యాడు. దీంతో న్యూజిలాండ్ 35 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్‌తో కలిసి మరో ఓపెనర్ టామ్ బ్లండెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి కొద్దిసేపు ఆసీస్ బౌలర్లను కంగారెత్తించారు. అయతే 30వ ఓవర్‌లో లియాన్ వేసిన రెండో బంతికి ముందుకొచ్చి ఆడిన హెన్రీ నికోల్స్ (33) స్టంపౌట్‌గా క్రీజును వదిలాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బీజే వాట్లింగ్‌తో జతకట్టిన బ్లండెల్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు వాట్లింగ్ సైతం నిధానంగా ఆడుతూ అందివచ్చిన బంతుల్ని బౌండరీలకు పంపుతున్నాడు. అయతే ప్రమాదకర మారుతున్న ఈ జంటను లియాన్ విడగొట్టాడు. 50వ ఓవర్ వేసిన లియాన్ రెండో బంతికి బీజే వాట్లింగ్ (22)ని బొల్తా కొట్టించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కొలిన్ డీ గ్రాండ్ హోం (9)ను కూడా అదే విధంగా అవుట్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు బ్లండెల్ మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో మిచెల్ శాంత్నర్‌తో కలిసి తన కెరీర్‌లో రెండో సెంచరీని సాధించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే శాంత్నర్ (27), టిమ్ సౌథీ (2) కూడా వెంటవెంటనే అవుటయ్యారు. సెంచరీ చేసి మంచి ఊపుమీదున్న బ్లండెల్ (121) చివరి వికెట్‌గా లబుషేన్‌కు చిక్కాడు. మరో వికెట్‌గా ట్రెంట్ బౌల్ట్ ఉన్నా బ్యాటింగ్‌కు రాకపోవడంతో న్యూజిలాండ్ పోరాటం ముగిసినట్లయంది. అప్పటికీ నెల్ వాగ్నార్ (6, నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్‌కు 4 వికెట్లు దక్కగా, జేమ్స్ ప్యాటిన్సన్ 3, మార్నస్ లబుషేకు 1 వికెట్ లభించాయ. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3న జరగనుంది.
'చిత్రం...విజయం సాధించిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆనందం