క్రీడాభూమి

దక్షిణాఫ్రికా చేతిలో ఇంగ్లాండ్‌కు ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, డిసెంబర్ 29: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా సొంత గడ్డపై విజయం సాధించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో డుప్లెసిస్ సేన 107 పరుగుల విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 95, రెండో ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేసిన వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు 375 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 268 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లలో రోరీ బర్న్స్ (84), కెప్టెన్ జో రూట్ (48) మాత్రమే రాణించారు. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.
'చిత్రం...కగిసో రబద 24-3-100-4