క్రీడాభూమి

షేన్‌వార్న్ సూచనలపై మండిపడ్డ నాథన్ లియోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 30: తదుపరి సిడ్నీ టెస్టు మ్యాచ్‌కు తనకు విశ్రాంతినిచ్చి లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్‌కు తొలి అవకాశం కల్పించాల్సిందిగా ప్రఖ్యాత మాజీ ఆల్ రౌండర్ షేన్‌వార్న్ చేసిన సూచనపై ఆస్ట్రేలియా ఔలర్ నాథన్ లియోన్ సోమవారం నాడిక్కడ మండిపడ్డాడు. న్యూజీల్యాండ్ జట్టును ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆదివారం 247 పరుగుల తేడాతో ఓడించడం జరిగింది. అలాగే పెర్త్ మ్యాచ్‌లో కూడా ఘనవిజయం దక్కింది. ఈ క్రమంలో కొత్తగా ఎంపికైన మిచెల్ స్వెప్సన్‌కు మూడో టెస్టులో అవకాశం కల్పించాలని షేర్‌వార్న్ సూచించాడు. ఐతే గత ఆదివారం న్యూజీల్యాండ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక భూమిక పోషించిన నాథన్ లియోన్ స్పందిస్తూ ‘వార్న్ ఏ నాడైనా తాను ఆడుతున్న సమయంలో మ్యాచ్ నుంచి తప్పుకుని సువార్ట్ మెగ్‌గిల్ వంటి వారికి అవకాశం ఇచ్చారా?’ అని ప్రశ్నించాడు. ‘నేను వైదొలిగే ప్రశే్నలేదు’ అని నాథల్ స్పష్టం చేశాడు. ‘వాస్తవానికి తదుపరి జరిగేది మూడో టెస్టు మ్యాచ్ కావచ్చు కానీ వచ్చిన ప్రతి అవకాశాన్నీ క్రీడాకారుడు సద్వినియోగం చేసుకోవాల’ని పేర్కొన్నాడు.