క్రీడాభూమి

‘ఖేలో ఇండియా’ యూత్‌గేమ్స్ సన్నాహక సంబురాలు షురూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, డిసెంబర్ 30: వచ్చే జనవరి 10 నుంచి 22 వరకు ఇక్కడ జరుగనున్న మూడవ ‘ఖేలో ఇండియా’ యూత్ గేమ్స్ ఉత్సవాల్లో భాగంగా దివిటీ ర్యాలీని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చే అథ్లెట్లకు సుహృద్భావ వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని కోరారు. ఈ పోటీలు ఇక్కడ నిర్వహించేందుకు సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్ సైతం ప్రసంగించారు. కాగా ఈ టోర్నీకి మొత్తం ఎనిమిది వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్‌గా అందరి ప్రసంశలు అందుకునేలా ఈ యూత్‌గేమ్స్‌ను నిర్వహించాలన్న కృత నిశ్చయంతో అధికారులు కృషి చేస్తున్నారు.