క్రీడాభూమి

భారత పర్యటనకు ఆస్ట్రేలియా వన్‌డే జట్టు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 30: భారత్‌లో త్వరలో పర్యటించనున్న ఆస్ట్రేలియా వన్‌డే జట్టు ఎంపిక సోమవారం జరిగింది. జట్టులో గాయపడిన పేస్ బౌలర్ సీన్ అబ్బాట్ స్థానంలో డీ’అక్రే షార్ట్ కొత్తగా జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ అరోన్ ఫించ్ నేతత్వంలోని ఈ 14 మంది జట్టు సభ్యుల్లో అబ్బాట్ గాయం కారణం కారణంగా నాలుగు వారాలపాటు ఆటకు దూరమయ్యాడు. జనవరి 14న ముంబయిలో జరిగే తొలి మ్యాచ్‌తో ఆస్ట్రేలియా వన్‌డే జట్టు పర్యటన ఆరంభమవుతుంది. రెండో మ్యాచ్ రాజకోట్‌లో, మూడోది బెంగళూరులో జరుగుతాయి. జట్టులో ఫాస్ట్ బౌలర్లు పాట్ కమ్మిన్స్, జోష్ హజ్లేవుడ్, మిచెల్ స్ట్రాక్, కనె రిచర్స్‌న్ ఉన్నారు. కాగా కొత్తగా జట్టులోకి వచ్చిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ డీ’ఆక్రే షార్ట్ స్పిన్ బౌలర్ కూడా.