క్రీడాభూమి

హోరాహోరీ పోరులో హంపి ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, డిసెంబర్ 30: భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి రెండో ప్రపంచ టైటిల్‌పై కనే్నసింది. ఇక్కడ జరుగుతున్న మహిళల ప్రపంచ ర్యాపిడ్, బ్రిడ్జ్ చాంపియన్‌షిప్ పోటీల్లో తొలిరోజు ఆట తర్వాత ఆమె ప్రంపచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరింది. ఈ 32 ఏళ్ల క్రీడాకారిణి గత శనివారం తొలి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇక్కడ ఆరంభమైన రెండు రోజుల బ్రిడ్జి కాంపిటీషన్స్‌లో తొలిరోజు ఐదు రౌండ్లలో తన గేమ్స్‌లో విజయం సాధించడం ద్వారా ఆమె టాప్ పొజిషన్‌కు చేరుకుంది. తర్వాత రెండు గేమ్స్‌ను హంపి డ్రా చేసింది. తర్వాత ఎనిమిదో గేమ్‌లో మోనికాసక్కోపై విజయం సాధించింది. ఐతే రష్యాకు చెందిన కేథరీనా లాగ్నోతో హోరాహోరాగా జరిగిన పోరులో చివరికి హంపి ఓటమి పాలైంది. 2018 టైటిల్‌ను నిలుపుకునేందుకు లాగ్నో చూపిన ప్రజ్ఞ విశేషంగా ఆకట్టుకుంది. మొత్తం 9 పాయింట్లలో 8 లాగ్నో దక్కించుకుని టాప్ పొజిషన్‌కు చేరింది. అలెగ్జాండ్రా కోస్టెనియక్, హంపి కోనేరు, డారియా చారోచికినా, అలీనా కాష్లిన్‌స్కయాలతో తలపడిన లాగ్నో అపార పొరాట పటిమ ప్రదర్శించింది.
'చిత్రం... భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి