క్రీడాభూమి

జింబాబ్వే టూర్‌కు ధోనీ బృందం పయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 8: భారత క్రికెట్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో బుధవారం జింబాబ్వే టూర్‌కు బయలుదేరి వెళ్లింది. 2017లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌పై దృష్టి కేంద్రీకరించిన ధోనీ అప్పటి వరకూ వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లో భారత్‌కు కెప్టెన్‌గా కొనసాగాలని ఆశిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న అతనికి అవకాశాలు మెరుగుపడాలంటే జింబాబ్వే టూర్‌లో, భారీ తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలి. ఈ టూర్‌లో భాగంగా భారత్ ఈనెల 11న, 13, 15 తేదీల్లో మూడు వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఆతర్వాత 18, 20, 22 తేదీల్లో టి-20 ఇంటర్నేషనల్స్‌లో జింబాబ్వేను ఢీ కొంటుంది. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌కు సెలక్టర్లు విశాంతినివ్వడంతో, ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ టూర్ నుంచి మురళీ విజయ్, ఆశిష్ నెహ్రాలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
జింబాబ్వే టూర్‌కు ఎంపికైన టీమిండియా
మహేంధ్ర సింగ్ ధోనీ (కెప్టెన్), లోకేష్ రాహుల్, మనీష్ పాండే, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, రిషీ ధావన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ధవళ్ కులకర్ణి, జస్‌ప్రీత్ బుమ్రా, బరీందర్ శరణ్, మన్దీప్ సింగ్, జైదేవ్ ఉనాద్కత్, యజువేంద్ర చాహల్. ఫైజ్ ఫజల్.