క్రీడాభూమి

2026 లేదా 2030లో కామనె్వల్త్ గేమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: 2026 లేదా 2030 కామనె్వల్త్ గేమ్స్‌లో ఏదో ఒక దాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సోమవారం వారం నాడిక్కడ భారత ఒలంపిక్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన టెండర్లలో సైతం పాలుపంచుకోనున్నట్టు తెలిపింది. అలాగే 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగే కామనె్వల్త్ గేమ్స్‌ను బహిష్కరించాలని ఇచ్చిన పిలుపును సైతం ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. ఆ గేమ్స్‌లో షూటింగ్ ఈవెంట్స్‌లో భారత్‌కు స్థానం కల్పించనందుకు నిరసనగా భారత్ ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాగా ఈ మల్టీస్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు అవసరమైన క్లియరెన్స్‌లు ఇవ్వాల్సింగా కోరేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మనదేశ ఒలంపిక్ అసోసియేషన్ (ఐఓఏ) త్వరలో కోరనుంది. గతంలో మనదేశం 2010 కామనె్వల్త్ గేమ్స్ ఎడిషన్‌ను దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా సోమవారం జరిగిన ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2026 లేదా 2030 కామనె్వల్త్ గేమ్స్‌లో ఒక దాన్ని మన దేశంలో నిర్వహించాలని, అలాగే 2022లో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగే గేమ్స్‌కు మన జట్లను పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా పీటీఐకి తెలిపారు. ప్రత్యేక కామనె్వల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్‌ఆర్‌ఐఏఐ) విజ్ఞప్తికి సైతం ఐఓఏ అంగీకారం తెలిపింది. బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న ప్రధాన గేమ్స్‌కు ముందుగానే మనదేశంలో ప్రత్యేక కామనె్వల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించాలని ఈమేరకు నిర్ణయం జరిగిందని రాజీవ్ మెహతా తెలిపారు. 2022 ఎడిషన్ రోస్టర్‌లో మళ్లీ స్థానం పొందేందుకు కృషిని కొనసాగించాలని కూడా తీర్మానించినట్టు తెలిపారు. అలాగే ఎన్‌ఆర్‌ఐఏఐ ప్రతిపాదనను కామనె్వల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఆమోదానికి పంపాలని నిర్ణయించామన్నారు. అక్కడ అంగీకారం పొందితే సీజీఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆ ప్రతిపాదన చేరుతుంది. కాగా గత వారం సీజీఎఫ్ భారత షూటింగ్ సమాఖ్యకు లేఖ రాసింది. వచ్చే నెలలోపు లాంఛనంగా దరఖాస్తు చేయాల్సిందిగా అందులో సూచించింది.