క్రీడాభూమి

కోహ్లీకే అగ్రపీఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: కొత్త ఏడాదిలోకి అడుగిడుతున్న దశలో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆగ్రస్థానంలో నిలిచాడు. ఐతే ఐదు రోజుల క్రికెట్లో స్పెషలిస్టుగా పేరున్న ఛటేశ్వర్ పుజారా ఒక ర్యాంకును కోల్పోయి ఐదో స్థానంలోకి దిగివచ్చాడు. మొత్తం 928 పాయింట్లతో కోహ్లి అగ్ర స్థానంలో నిలువగా ఆస్ట్రేలియా మాస్ట్రో స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. న్యూజీల్యాండ్ కెప్టెన్ కేన్ వివియమ్సన్ 822 పాయింట్లలో మూడో స్థానంలో నిలచాడు. కాగా ఈ ఏడాది 11 టెస్టుల్లో 1,085 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుస్చగ్నే తన ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. తదుపరి ఐదో స్థానంలో భారత బ్యాట్స్‌మన్ పూజారా (791 పాయింట్లు) నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 95 పరుగులతో ఆకట్టుకున్న భారత ఆటగాడు అజింక్య రహానే 759 పాయింట్లతో ఏడో ర్యాంకుకు ఎగబాకాడు. అలాగే స్మిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిదవ ర్యాంకును, సీమర్ మహమ్మద్ షమీ 771 పాయింట్లతో 10వ ర్యాంకును దక్కించుకున్నారు.
బౌలర్లలో అగ్రగామి కమ్మిన్స్
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ మొత్తం 902 పాయింట్లతో బౌలర్లలో అగ్ర స్థాయి ర్యాంకును కేవసం చేసుకున్నాడు. రెండో స్థానంలో నీల్ వాఘ్నర్ (859 పాయింట్లు) నిలిచాడు. దక్షిణాఫ్రికా పేసర్ కాగిసో రబాడా 832 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

'చిత్రం... భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి