క్రీడాభూమి

అద్భుతంగా గడిచింది : బుమ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఈ ఏడాది తనకు ఎన్నో జ్ఞాపకలను ఇచ్చిందని టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. 2019లోని జ్ఞాపకలతో తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అద్భుత విజయాలు, కఠోర శ్రమ అభ్యాసాలు జ్ఞాపకాలతో మైదానంలోనూ అవతల 2019 అద్భుతంగా గడిచింది. ఈ ఏడాది ఇదే అఖరి రోజు. 2020 అందించే ప్రతిదాని కోసం ఎదురు చూస్తున్నాను. అని ట్వీట్ చేశాడు. బుమ్రా ఈ ఏడాది టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసందే. ఆగస్టులో వెస్టిండీస్‌పై హ్యాట్రిక్ సాధించిన అతడు గాయం కారణంగా జట్టుకు దాదాపు నాలుగు నెలల పాటు దూరమయ్యాడు. అయతే కొత్త ఏడాది జనవరిలో శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌లకు ఎంపికయ్యాడు. అంతేకాకుండా ఇటీవల ఐసీసీ ప్రకటించిన వనే్డ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా, టెస్టు ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో నిలిచాడు.
ఆటగాళ్లకు రవిశాస్ర్తీ శుభాకాంక్షలు..
భారత క్రికెటర్లకు కోచ్ రవిశాస్ర్తి ట్విటర్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2019లో అద్భుతంగా రాణించారని, 2020లోనూ ప్రత్యర్థి జట్లపై విరుచుకు పడాలని పేర్కొన్నాడు.