క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ రెండో రౌండ్‌కు సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 8: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్ చేరింది. అయితే, మరో హైదరాబాదీ పివి సింధు మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ శుభారంభం చేయగా, గురుసాయిదత్ పోరు మొదటి రౌండ్‌కే పరిమితమైంది. 2014లో ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ టైటిల్‌ను అందుకున్న సైనా మొదటి రౌండ్‌లో స్థానిక క్రీడాకారిణి జోయ్ లయ్‌పై 21-10, 21-14 తేడాతో సునాయాసంగా గెలిచింది. ఆమె తర్వాతి రౌండ్‌లో మలేసియాకు చెందిన జిన్ వెయ్ గోను ఢీ కొంటుంది. కాగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న సింధు మొదటి రౌండ్‌లో దక్షిణ కొరియా క్రీడాకారిణి కిమ్ హ్యో మిన్‌తో తలపడి, 15-21, 19-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. భారత యువ క్రీడాకారిణి తన్వీ లాడ్ 18-21, 21-14, 21-11 స్కోరుతో క్వాలిఫయర్ టిఫానీ హో (ఆస్ట్రేలియా)ను ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె రెండో రౌండ్‌లో నాలుగో సీడ్ వాంగ్ ఇహాన్‌తో పోరాడనుంది.
పురుషుల విభాగంలో 12వ ర్యాంక్ ఆటగాడు శ్రీకాంత్ మొదటి రౌండ్‌లో ఇన్ కా లాంగ్ అగస్ (హాంకాంగ్)ను 21-16, 21-12 తేడాతో ఓడించి రెండో రౌండ్ చేరాడు. అతను రెండో రౌండ్‌లో సోనీ ద్వి కున్కొరోను ఎదుర్కొంటాడు. సమీర్ వర్మ చివరి వరకూ పోరాడి, ఇషాన్ వౌలానా ముస్త్ఫొను 22-20, 15-21, 21-15 తేడాతో ఓడించాడు. కాగా, గురుసాయిదత్ 19-21, 21-12, 15-21 తేడాతో ప్రపంచ 14వ ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్) చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. పురుషుల డబుల్స్‌లో నిఖర్ గార్గ్, అనీల్ కుమార్ రాజు జోడీ 12-21, 10-21 తేడాతో షెమ్ గో, వీ కియాంగ్ తాన్ జోడీ చేతిలో ఓటమిపాలైంది.