క్రీడాభూమి

టీమిండియా కెప్టెన్ విరాట్‌కు మరో అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ క్రికెట్ స్పోర్ట్స్ సంస్థ క్రిక్‌బజ్ ఈ దశాబ్దపు టెస్టు, వనే్డ జట్టు కెప్టెన్‌గా కోహ్లీని ఎంపిక చేసింది. క్రిక్‌బజ్ ప్రకటించిన రెండు జట్లకు కోహ్లీయే కావడం విశేషం. ఓ భారత క్రికెటర్ ఇలాంటి గౌరవం దక్కడం ఇదే మొ దటిసారి. ఈ దశాబ్దంలో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్లను ఎంపిక చేసినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది.
ధోనీకి దక్కని చోటు..
టీమిండియా వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి క్రిక్‌బజ్ రెండు జట్లలోనూ చోటు కల్పించకపోవడం విశేషం. ధోనీకి బదులు ఇం గ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌ను జట్టులోకి తీసుకుంది. వనే్డల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ, హషీమ్ ఆమ్లాను తీసుకోగా, మూడో బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీతో పాటు, మిడిలార్డర్‌లో రాస్ టేలర్, ఏబీ డివిలియర్స్, షకిబుల్ హ సన్, జోస్ బట్లర్‌ను తీసుకుంది. ఇక బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్ క, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ వంటి పేసర్లతో పాటు ఇమ్రాన్ తాహీర్, షకి బుల్ హసన్‌ను స్పిన్ విభాగంలో తీసుకుంది. అయతే క్రిక్‌బజ్ ప్రకటించిన రెండు జట్లలో పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల ఆటగాళ్లకు చోటు దక్కలేదు.
టెస్టు జట్టు: అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కుమార సంగాక్కర, విరాట్ కోహ్లీ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రంగాన హెరాత్, డేల్ స్టెయన్, మోర్ని మోర్కల్, జేమ్స్ అండర్సన్.
వనే్డ జట్టు: రోహిత్ శర్మ, హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రాస్ టేలర్, ఏబీ డివిలియర్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షకీబుల్ హసన్, ఇమ్రాన్ తాహీర్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ.
'చిత్రం... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ