క్రీడాభూమి

భారత పర్యటనకు లంక రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: భారత్- శ్రీలంక మధ్య ఈ నెల 5 నుంచి జరిగే టీ20 సిరీస్‌కు శ్రీలంక 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జట్టుకు లసిత్ మలింగ కెప్టెన్‌గా వ్యవహ రించనుండగా, 16 నెలల అనంతరం ఆల్‌రౌండర్ ఏంజిలో మాథ్యూస్‌కు లంక బోర్డు అవకాశం కల్పించింది. దీంతో లసిత్ మలింగ, ఏంజిలో మాథ్యూస్, కుశాల్ పెరీరా, కుశల్ మెండీస్‌తో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. అయతే ఇటీవల పాకిస్తాన్‌ను సొంత గడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన లంక, అదే జోరును భారత్‌పై కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు టీమిండియా సైతం వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయతే కెప్టెన్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్య ర్, రిషభ్ పంత్‌తో భారత్ బలంగా కనిపిస్తోంది. ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జనవరి 5న గౌహతి వేదికగా మొదటి మ్యాచ్ జరగనుండగా, 7న ఇండోర్, 10న పుణె వేదికగా మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయ.
శ్రీలంక జట్టు: లసిత్ మలింగ (కెప్టెన్), ధనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజిలో మాథ్యూస్, దసున్ శనక, కుశల్ పెరీరా, నిరోషన్ డిక్వెల్లా, ధనుంజయ డిసిల్వా, ఇసురు ఉదాన, భానుక రాజపక్స, ఒషాడో ఫెర్నాండో, వానిందు హసరంగా, లహీరు కుమార, కుశల్ మెండీస్, లక్ష్యన్ సందకాన్, కసున్ రజిత.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా.