క్రీడాభూమి

ఇప్పుడేం స్పందించను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహాతి, జనవరి 4: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై స్పందించేం దుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాకరించాడు. సున్నితమైన ఈ అంశంపై పూర్తి అవగాహన వచ్చాకే మాట్లాడగలనని స్పష్టం చేశాడు. శ్రీలంకతో మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం గౌహాతి వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. పౌరసత్వ చట్టంపై అక్కడ కొన్ని రోజులు తీవ్ర నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అప్గానిస్తాన్, పాకిస్తాన్, బం గ్లాదేశ్‌లో మతపరమైన హింసకు గురై భారత్‌లో కొనే్నళ్లుగా తలదాచుకుంటున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు ఎలాంటి ధ్రువపత్రం లేకుండా ఈ చట్టం ద్వారా పౌరసత్వం ఇస్తారు. ఇంతకుముందు శరణార్థుల కు పౌరసత్వం ఇవ్వాలంటే 12 ఏళ్ల పరిమితి తప్పనిసరి. ప్రధాని నరేంద్రమోదీ గతంలో పెద్ద నోట్లు రద్దు చేయడాన్ని కోహ్లీ స్వాగతించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆందోళనల నేపథ్యంలో మైదానంలోకి ఎలాంటి బ్యానర్లు, తువ్వాళ్లను సిబ్బంది అనుమతించడం లేదు.
'చిత్రం... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ