క్రీడాభూమి

వికాల్ట్ ‘రికార్డు’ పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంట్రెయుల్ (ఫ్రాన్స్), జూన్ 8: ఫ్రెంచ్ స్ప్రింటర్ జిమీ వికాల్ట్ 100 మీటర్ల పరుగును రికార్డు సమయంలో పూర్తి చేశాడు. ఇక్కడ జరిగిన మాంట్రెయిల్ అథ్లెటిక్ మీట్‌లో పాల్గొన్న అతను లక్ష్యాన్ని 9.86 సెకన్లలో పూర్తి చేసి, ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన టైమింగ్స్‌ను నమోదు చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ స్ప్రింట్‌లో ఇదే రికార్డు కావడం విశేషం. ఇటీవల రోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 100 మీటర్ల దూరాన్ని 9.99 సెకన్లలో చేరిన అతను రియోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. ఇప్పుడు ఈ సీజన్‌లోనే మెరుగైన పరుగుతో ప్రత్యర్థులకు పరోక్షంగా సవాళ్లు విసిరాడు. ఈఏడాది ఫెమీ ఆగునోడ్ 9.91 సెకన్లు, కిమ్ కొలిన్ సెకన్లు, జస్టిన్ గాల్టిన్ 9.93 సెకన్లలో వంద మీటర్ల పరుగును పూర్తి చేయగలిగారు. ఒలింపిక్స్‌లో మరోసారి 100, 200 మీటర్ల పరుగులతోపాటు 4న100 మీటర్ల రిలేలోనూ టైటిళ్లను నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగనున్న ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ ఈ ఏడాది అత్యుత్తమంగా 9.98 సెకన్లలో గమ్యాన్ని చేరాడు. అయితే, ఈ విభాగంలో ప్రస్తుతం ప్రపంచ రికార్డు 9.58 సెకన్లతో అతని పేరుమీదే ఉంది.
డెంప్సే ‘హాఫ్ సెంచరీ’
కోపా అమెరికాలో కొలంబియాపై యుఎస్ గెలుపు
చికాగో, జూన్ 8: కోపా అమెరికా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌ని అమెరికా 4-0 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ తొమ్మిదో నిమిషంలోనే యుఎస్‌కు తొలిగోల్‌ను అందించిన క్లాంట్ డెంప్సే జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. అతనికి కెరీర్‌లో ఇది 50వ అంతర్జాతీయ గోల్ కావడం విశేషం. డెంప్సే అందించిన తొలి గోల్‌తో స్ఫూర్తిని పొందిన జెర్మైన్ జోన్స్ 37వ నిమిషంలో గోల్ సాధించాడు. 42వ నిమిషంలో బాబీ ఉడ్ గోల్ చేయడంతో, ప్రథమార్ధం ముగిసే సమయానికి అమెరికా 3-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ద్వితీయార్ధంలో ఎక్కువ సమయాన్ని యుఎస్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ మాదిరిగా కొనసాగించారు. దీనితో చాలాసేపు గోల్స్ నమోదు కాలేదు. 87వ నిమిషంలో గ్రాహం జుసీ చేసిన గోల్‌తో అమెరికా 4-0 ఆధిక్యాన్ని సంపాదించి, చివరికి అదే స్కోరుతో మ్యాచ్‌ని ముగించింది.
పరాగ్వే ఓటమి
కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో పరాగ్వే 1-2 తేడాతో ఓటమిపాలైంది. ఈ జట్టుకు విక్టర్ యాలా 71వ నిమిషంలో కంటితుడుపు గోల్‌ను అందించాడు. అంతకు ముందు 12వ నిమిషంలో కార్లొస్ బక్కా, 30వ నిమిషంలో జేమ్స్ రోడ్రిగెజ్ గోల్స్ సాధించి కొలంబియాకు ఆధిక్యాన్ని అందించారు. అనంతరం ఆ జట్టు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఓటమిని తప్పించుకోవడానికి పరాగ్వే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

షరపోవాపై రెండేళ్ల
సస్పెన్షన్ వేటు
లండన్, జూన్ 8: నిషిద్ధ మాదక ద్రవ్యం మెల్డోనియంను వినియోగించిన రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (డబ్ల్యుటిఎ) రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. ఆస్ట్రేలియా ఓపెన్ సమయంలో తాను మెల్డోనియం ద్రవ్యాన్ని వాడినట్టు షరపోవా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ వెంటనే ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన డబ్ల్యుటిఎ అనంతరం నాలుగేళ్ల సస్పెన్షన్‌ను విధించింది. అయతే, తాను ఉద్దేశపూర్వకంగా ఆ ద్రవ్యాన్ని వాడలేదని, సాధారణ రుగ్మతకు వాడే మందుల్లో అది ఉందని తనకు తెలియదని షరపోవా వాదించింది. దీనిపై డబ్ల్యుటిఎ బృందం స్పందిస్తూ, షరపోవా కావాలని మెల్డోనియంను వాడలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయతే, జరిగిన పొరపాటుకు ఆమే పూర్తిగా బాధ్యత వహించాలని, అందుకే రెండేళ్లు సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది.