క్రీడాభూమి

భారత్ బోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్: ఈ ఏడాదిలో టీమిండియా గెలుపుతో శుభారంభం చేసింది. శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తో సమష్టిగా రాణించింది. అం తకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు ప్రా రంభంలో ఫర్వాలేదనిపించింది. ఓపెనర్లు ధనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నండోలు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. అయతే జట్టు స్కోరు 38 పరుగుల వద్ద అవిష్క ఫెర్నాండో (22)ని వాషింగ్టన్ సుందర్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ధనుష్క గుణతిలక (20)ని నవదీప్ సైనీ బౌల్డ్ చేశాడు. ఇక్కడి నుంచి లంక పతనం ప్రారంభమైంది. ఈ క్ర మంలో ఒషాడ ఫెర్నాండోతో కలిసి క్రీజులో ఉన్న వికెట్ కీపర్ కుశల్ పెరీరా మూడు సిక్సర్లతో కొద్దిసేపు ఆకట్టుకున్నాడు. అయతే మరోవైపు ఒషాడ ఫెర్నాండో (10) కుల్దీప్ బౌలింగ్ హిట్టింగ్ వచ్చి ఆడే క్రమంలో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. కాసే పటికే కుశల్ పెరీరా (34) కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో క్రీజులో ఉన్న భానుక రాజపక్స (9), దసున్ శనక (7), ధనుంజయ డిసిల్వా (17), ఇసురు ఉదాన (1), లసిత్ మలింగ (0) ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరడంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 142 పరుగులు చేసింది. వానిందు హసరంగా (16), లహీరు కుమార (0) చివరి వరకు క్రీజులో నిలిచారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీసుకోగా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఠాకూర్ సూపర్ బౌలింగ్..
భారత యువ బౌలర్ శార్దుల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. 19 ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
మెరిసిన లోకేష్, కోహ్లీ..
ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 17.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయ విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్ చక్కని శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 71 పరుగుల విలువైన భాగస్వామ్యా న్ని నమోదు చేశారు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతున్న లోకేష్ రాహుల్ (45) హసరంగాకు వికెట్ల ముందు దొరికిపోవడంతో టీమిండియా తన మొదటి వికెట్‌ను కోల్పోయంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో శిఖర్ ధావన్ (32) ఆచి తూచి పరుగులను రాబట్టే క్రమంలో హసరంగా బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటికీ భారత్ 2 వికెట్లు కోల్పోయ 86 పరుగులు చేసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక బౌల ర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులను రాబట్టారు. అయతే 18వ ఓవర్‌లో లహీరు కుమార వేసిన అద్భుత బంతికి శ్రేయాస్ అయ్యర్ (34) అవుట్ అయ్యాడు. మిగతా పనిని కెప్టెన్ విరాట్ కోహ్లీ (30, నాటౌట్), రిషభ్ పంత్ (1, నాటౌట్) మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు.
స్కోర్ బోర్డు..
శ్రీలంక ఇన్నింగ్స్: ధనుష్క గుణతిలక (బీ) నవదీప్ సైనీ 20, అవిష్క ఫెర్నాండో (సీ) నవదీప్ సైనీ (బీ) వాషింగ్టన్ సుందర్ 22, కుశల్ పెరీరా (సీ) ధావన్ (బీ) కుల్దీప్ యాదవ్ 10, ఒషాడో ఫెర్నాండో (స్టంప్) పంత్ (బీ) కుల్దీప్ యాదవ్ 10, భానుక రాజపక్స (సీ) పంత్ (బీ) నవదీప్ సైనీ 9, దసున్ శనక (బీ) బుమ్రా 7, ధనుంజయ డిసిల్వా (సీ) శివబ్ దుబే (బీ) శార్దుల్ ఠాకూర్ 17, వాహీదు హసరంగా (నాటౌట్) 16, ఇసురు ఉదాన (సీ) నవదీప్ సైనీ (బీ) శార్దుల్ ఠాకూర్ 1, లసిత్ మలింగ (సీ) కుల్దీప్ యాదవ్ (బీ) శార్దుల్ ఠాకూర్ 0, లహీరు కుమార (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 142 (20 ఓవర్లలో 9 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-38, 2-54, 3-82, 4-97, 5-104, 6-117, 7-128, 8-130, 9-130.
బౌలింగ్: జస్ప్రీత్ బుమ్రా 4-0-32-1, శార్దుల్ ఠాకూర్ 4-0-23-3, నవదీప్ సైనీ 4-0-18-2, వాషింగ్టన్ సుందర్ 4-0-29-1, కుల్దీప్ యాదవ్ 4-0-38-2.
భారత్ ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ (బీ) వానిందు హసరంగా 45, శిఖర్ ధావన్ (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) వానిందు హసరంగా 32, శ్రేయాస్ అయ్యర్ (సీ) శనక (బీ) లహీరు కుమార 34, విరాట్ కోహ్లీ (నాటౌట్) 30, రిషభ్ పంత్ (నాటౌట్) 1.
ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 144 (17.3 ఓవర్లలో 3 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-71, 2-86, 3-137
బౌలింగ్: లసిత్ మలింగ 4-0-41-0, లహీరు కుమార 3.3-0-30-1, ధనుంజయ డిసిల్వా 2-0-15-0, దసున్ శనక 4-0-26-0, వానిందు హసరంగా 4-0-30-2.
'చిత్రం... మూడు వికెట్లు తీసిన శార్దుల్ ఠాకూర్‌ని అభినందిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ