క్రీడాభూమి

సమష్టి కృషితో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రోవిడెన్స్ (గుయానా), జూన్ 8: ఇక్కడ జరుగుతున్న ముక్కోణపు వనే్డ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాను ఢీకొన్న దక్షిణాఫ్రికా సమష్టి కృషి ఫలితంగా 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తరఫున ఆరోన్ ఫించ్ (72) ఒక్కడే ఒంటరి పోరాటాన్ని కొనసాగించాడు. అతనితోపాటు టెయిలెండర్లు నాథన్ లియాన్ (30), జొష్ హాజెల్‌వుడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కు పరిమితమై నిష్క్రమించారు. ఫలితంగా ఆస్ట్రేలియా 34.2 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్లకు 189 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరును సాధించింది. క్వింటన్ డికాక్ 18 పరుగులు చేసి, జొష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగడంతో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. రిలీ రూసో 7 పరుగులు చేసి, నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రూసో గాయపడ్డాడు. అతని భుజం ఎముక జారిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, హషీం ఆమ్లా 35, ఎబి డివిలియర్స్ 22 పరుగులతో రాణించి, దక్షిణాఫ్రికాను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఫర్హాన్ బెహర్డియన్ చివరిలో బాధ్యతాయుతంగా ఆడుతూ 82 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి, గ్లేన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అతని ప్రతిభ వల్లే దక్షిణాఫ్రికా నిలదొక్కుకోగలిగింది. వేన్ పార్న్(2), ఆరోన్ ఫాగిసో (9), ఇమ్రాన్ తాహిర్ (0) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరగా, దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసే సమయానికి కాగిసో రబదా (15), తర్బాజ్ షంశీ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జొష్ హాజెల్‌వుడ్, నాథన్ కౌల్టర్ నైల్, గ్లేన్ మాక్స్‌వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
దక్షిణాఫ్రికాను ఓడించేందుకు 190 పరుగులు సాధించాల్సి ఉండగా, కేవలం ఒక పరుగు స్కోరువద్ద డేవిడ్ వార్నర్ (1) వికెట్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా ఆతర్వాత కోలుకోలేకపోయింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడగా, ఉస్మాన్ ఖాజా (2), స్టీవెన్ స్మిత్ (8), గ్లేన్ మాక్స్‌వెల్ (3), మిచెల్ మార్ష్ (8), మాథ్యూ వేడ్ (2), నాథన్ కౌల్టర్ నైల్ (0), ఆడం జంపా (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫించ్ 103 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి ఆరోన్ ఫాంగిసో బౌలింగ్‌లో ఎబి డివిలియర్స్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. చివరిలో నాథన్ లియాన్ 31 బంతుల్లో 30 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 34.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటయ్యే సమయానికి జొష్ హాజెల్‌వుడ్ 11 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ కాగిసో రబదా 13 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. వేన్ పార్నెల్, ఇమ్రాన్ తాహిర్, ఆరోన్ ఫాంగిసో తలా రెండేసి వికెట్లు సాధించారు.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 9 వికెట్లకు 189 (హషీం ఆమ్లా 35, ఎబి డివిలియర్స్ 22, ఫర్హాన్ బెహర్డియన్ 62, జొష్ హాజెల్‌వుడ్ 2/20, నాథన్ కౌల్టర్ నైల్ 2/38, గ్లేన్ మాక్స్‌వెల్ 2/15).
ఆస్ట్రేలియా: 34.2 ఓవర్లలో 142 ఆలౌట్ (ఆరోన్ ఫించ్ 72, నాథన్ లియాన్ 30, కాగిసో రబదా 3/13, వేన్ పార్నెల్ 2/23, ఇమ్రాన్ తాహిర్ 2/39, ఆరోన్ ఫాంగిసో 2/26).