క్రీడాభూమి

రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిలైడ్, జనవరి 8: బిగ్ భాష్ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై సిడ్నీ సిక్సర్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్ 19.4 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. జాక్ వెదర్లాండ్ (47), కెప్టెన్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (32) రాణించారు. టామ్ కుర్రాన్ 4 వికెట్లు తీయగా, బెన్ డ్వాషిస్, లియాడ్ పోప్ రెండేసి వికెట్లు, జాక్సన్ బర్డ్, జోష్ హజెల్‌వుడ్‌లు ఒక్కో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సిడ్నీ సిక్సర్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. జేమ్స్ విన్స్ (27), టామ్ కుర్రాన్ (21) రాణించగా, చివర్లో బర్త్ డే బాయ్ జోష్ హజెల్ వుడ్ హ్యాట్రిక్ బౌండరీలతో జట్టును గెలిపించాడు. అంతకుముందు అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వికెట్లను తీసినా జట్టు గెలిపించలేక పోయాడు.

'చిత్రం...*రషీద్ ఖాన్