క్రీడాభూమి

లబుషేన్ @3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి: న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సెంచరీ, డబుల్ సెంచరీతో అదరగొట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాకింగ్స్‌లో ఒక స్థానం ఎగబాకి 827 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అలాగే ఆసిస్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక స్థానం దిగజారి 814 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమిత మయ్యాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 911 రేటింగ్ పాయింట్లతో తన రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా, 928 రేటింగ్ పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. కివీస్‌తో టెస్టులో చివరి టెస్టులో సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 793 రేటింగ్ పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (791), బాబర్ అజామ్ (767), జో రూట్ (761), అజింక్యా రహానే (759), బెన్ స్టోక్స్ (708) రేటింగ్ పాయింట్లతో టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.
'చిత్రం... మార్నస్ లబుషేన్