క్రీడాభూమి

హైదరాబాద్ 225 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 11: రంజీట్రోఫీలో భాగంగా ఆంధ్రాతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు మొదటిరోజు శనివారం 225 పరుగులకు కుప్పకూలింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరా బాద్ జట్టులో జావేద్ అలీ (98), కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (33), యుద్వీర్ సింగ్ (31, నాటౌట్) మాత్రమే రాణించారు. ఆంధ్రా బౌలర్లలో కేవీ శశికాంత్ 5 వికెట్లు పడగొట్టగా, యర్రా పృథ్వీరాజ్ 3, పైడికాల్వ విజయ్ కుమార్, బందరు అయ్యప్ప ఒక్కో వికెట్ తీశారు. అనంతరం మొదటి ఇన్నిం గ్స్‌కు దిగిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు సీఆర్ జ్ఞానేశ్వర్ (4), ప్రశాంత్ కుమార్ (9) క్రీజులో ఉన్నారు.
బెంగాల్ 170..
నాగ్‌పూర్: రంజీట్రోఫీలో భాగంగా విదర్భ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ జట్టు 170 పరుగులకే ఆలౌ టైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ జట్టులో మనోజ్ తివారీ (48), రిత్విక్ చౌదరి (27) మినహా, మిగిలిన బ్యాట్స్‌మెన్లంతా తక్కువ స్కోర్లకే అవుట య్యారు.
విదర్భ బౌలర్లలో అక్షయ్ వాఖరేకు 5 వికెట్లు దక్కగా, ఆదిత్య సర్వతేకు 4, ఉమేశ్ యాదవ్‌కు 1 వికెట్ లభించింది. అనంతరం మొదటి ఇన్నింగ్ సకు దిగిన విదర్భ జట్టు మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయ 89 పరుగులు చేసింది. కెప్టెన్ ఫయాజ్ ఫజల్ (51), సంజయ్ రఘునాథ్ (10), వసీం జాఫర్ (11) పెవి లియన్ చేరగా, గణేష్ సతీష్ (15, నాటౌట్) క్రీజులో కొన సాగుతున్నాడు. బెంగాల్ బౌలర్లలో ఆర్నాబ్ నంది, షాబా జ్ అహ్మద్, శ్రేయాన్ చక్రబొర్తి తలా ఒక్కో వికెట్ తీశారు.
'చిత్రం... ఆర్నాబ్ నంది, శ్రేయాన్ చక్రబొర్తి