క్రీడాభూమి

రాహుల్ 6, కోహ్లీ 9..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, జనవరి 11: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకు లను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ 760 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగు పరుచుకొని 683 పాయింట్లతో 9వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. రాహుల్, కోహ్లీ మినహా మిగతా భారత బ్యాట్స్‌మెన్స్ ఎవరికీ టాప్-10లో చోటు దక్కలేదు. ఇదిలాఉంటే పాకిస్తాన్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ 879 పాయంట్లతో టాప్‌లో నిలవగా, 810 పాయంట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, 782 పాయింట్లతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్, న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మున్రో 780 పాయంట్లు, ఆసిస్ స్టార్ హిట్టర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ 766 పాయంట్లతో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ ఎవిన్ లూయస్ (699), అఫ్గానిస్తాన్ బ్యాట్స్‌మన్ హజ్రతుల్లా జజై (692) ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో నిలవగా, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (653) టాప్ 10లో నిలిచాడు.