క్రీడాభూమి

టీ20 ప్రపంచకప్ ముందు పరేషాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె: ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాను సరికొత్త సమస్య వెంటాడుతోంది. అవకాశం వచ్చిన ఆటగాళ్లంతా తమను తాము నిరూపిం చుకోవడంతో జట్టు కూర్పు కష్టతంగా మా రింది. దీంతో ప్రపంచకప్‌కు ఎవరినీ ఎంపిక చేయాలో తెలియక జట్టు మేనేజ్‌మెంట్ సత మతమవుతోంది. ఓవైపు ఇప్పటికే వికెట్ కీప ర్ మహేంద్రసింగ్ ధోనీ, రిషభ్ పంత్‌లలో ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆలోచనలో ప డగా, తాజాగా ఓపెనర్ల విషయంలోనూ టీమిండియా మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడింది. రోహిత్ శర్మతో పాటు గతంలో మం చి భాగస్వామ్యాలు నిర్మించిన శిఖర్ ధావన్ ప్రపంచకప్‌కు ముందు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ధావన్ రాణించడంతో జట్టు మేనేజ్‌మెంట్ సందిగ్ధంలో పడింది. అయతే అంతకుముందు ధావన్ స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ వచ్చిన ప్రతి అవకాశా న్ని సద్వినియోగించుకుంటున్నాడు. గత కొ న్నాళ్లుగా నిలకడగా రాణిస్తూ జట్టు విజయా ల్లో తన పాత్ర చక్కగా పోషిస్తున్నాడు. దీంతో రోహిత్‌తో జోడీగా ఎవరిని పంపాలనే దానిపై అయోమయంలో పడింది.
అంతా జట్టు మేనేజ్‌మెంట్‌దే..
ఈ విషయమై తాజాగా శిఖర్ ధావన్ మాట్లాడుతూ ‘రానున్న టీ20 ప్రపంచకప్ సమయానికిలో తాను జట్టులో ఉంటానా? లేదా? అనేది నేను చెప్పలేను. దాని గురించి పెద్దగా ఆలోచించను. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగించుకోవడమే నా పని. రోహిత్, రాహుల్‌తో పాటు నేను సరైన సమయంలో రాణిస్తున్నా. గతేడాది రోహిత్ సూపర్ ఫాంలో కొనసాగాడు. రాహుల్ కూ డా గత కొద్దిరోజులుగా చక్కని ప్రదర్శన చేస్తు న్నాడు. అయనా వారితో పాటు నేనూ రేసులో ఉన్నాను. టీ20 ప్రపంచకప్‌కు చాలా సమ యం ఉంది. దాని గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం అనవసరం.’ అని పేర్కొన్నాడు.
''చిత్రాలు..మహేంద్రసింగ్ ధోనీ *రిషభ్ పంత్