క్రీడాభూమి

సెంచరీతో చెలరేగిన స్టొయనిస్ మెల్‌బోర్న్ స్టార్స్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 12: బిగ్ భాష్ లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్ స్టార్స్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ మార్కస్ స్టొయనిస్ (79 బంతుల్లో 147, నాటౌట్) సెంచరీకి తోడు హిల్టన్ కార్ట్‌వైట్ (59) అర్ధ సెంచరీ సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సిడ్నీ సిక్సర్స్ జట్టు 7 వికెట్లు కోల్పోయ 175 పరుగులు మాత్రమే చేసి 44 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. సెంచరీతో రాణించి జట్టును గెలిపించిన మార్కస్ స్టొయనిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.