క్రీడాభూమి

మరో ఘనతకు చేరువలో కోహ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించేందుకు అత్యంత చేరువలో ఉన్నాడు. స్వదేశంలో ఆడిన వనే్డల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ సమం చేయనున్నాడు. మంగళవారం నుంచి భారత్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడనుంది. స్వదేశంలో జరిగే వనే్డల్లో కోహ్లీ మరొక సెంచరీ చేస్తే స్వదేశంలో ఆ ఘనత సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేయనున్నాడు. మన దేశంలో జరిగిన 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటివరకు 20 శతకాలు చేసిన రికార్డు ఒక్క కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. జట్టు కెప్టెన్‌గా స్వదేశంలో ఆడిన వనే్డల్లో కోహ్లీ ఇప్పటివరకు 19 శతకాలు చేశాడు. ముంబయిలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే తొలి వనే్డలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేస్తే సచిన్ సెంచరీల రికార్డుకు సమం చేసినట్టు అవుతుంది. ఇదిలావుండగా, అన్ని ఫార్మాట్లలోనూ త్వరితగతిన 11 వేల పరుగులు చేసిన ఘనత ఇప్పటికే కోహ్లీ పేరిట ఉంది.