క్రీడాభూమి

నా స్థానంలో మార్పునకు రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: బ్యాటింగ్ ఆర్డర్‌లో తన స్థానాన్ని మార్చుకోడానికి ఎలాంటి ఇబ్బంది లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భాగంగా మంగళవారం ముంబయి వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి వనే్డ జరుగనుంది. తమ జట్టు ఆటగాళ్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌ను అదే స్థానంలో ఆడించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అదేవిధంగా వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ చోటుకు కూడా ఎలాంటి ఢోకా లేదని అన్నాడు. మంచి కాంబినేషన్‌తో ఎక్కువ ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ప్రతిభ కలిగిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు, తద్వారా టీమ్‌కు మేలు జరిగేందుకు వీలుగా తన స్థానాన్ని మరింత తక్కువ చేసుకునేందుకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశాడు. అదే క్రమంలో తన బ్యాటింగ్ స్థానం తగ్గినందుకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఏ స్థానంలో ఉన్నా ఆటపై దృష్టి మరల్చి, జట్టును ఆదుకోవడమే గొప్ప విషయమని అన్నాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఈ ముగ్గురూ జట్టులో ఉండాల్సిందేనని నొక్కి వక్కాణించాడు.