క్రీడాభూమి

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 13: భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిర్వహిస్తే సమంజసంగా ఉంటుందని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది వేసవి కాలంలో తమ దేశంలోని ఏ మైదానంలోనైనా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా ప్రకటన చేసిన నేపథ్యంలో వార్న్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అయితే, భారత్‌తో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లతోటు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిర్వహించే ఆలోచన చేస్తే బాగుంటదని వార్న్ సూచించాడు. టీమిండియా ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లనుంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతోపాటు కొన్ని టీ-20 మ్యాచ్‌లలో కూడా ఆసిస్‌తో భారత్ తలపడనుంది. వాస్తవానికి 2018-19లోనే ఆస్ట్రేలియాలో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఏర్పాటు చేయాలని టీమిండియా యోచించినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే, ఆసిస్ గడ్డపై డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో షేన్ వార్న్ పైవిధంగా స్పందించాడు.

'చిత్రం...ఆసిస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్