క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీ హాకీ భారత్‌కు తొలి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 9: చాంపియన్స్ ట్రోఫీ హాకీలో పాల్గొంటున్న సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టుకు మొదటి మ్యాచ్‌లోనే ఒలింపిక్ స్వర్ణ పతక విజేత జర్మనీ నుంచి పరీక్ష ఎదురుకానుంది. లీ వాలీ హాకీ సెంటర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో జర్మనీకి ఏ స్థాయిలో పోటీనిస్తుందనే అంశంపైనే భారత్ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. రియో ఒలింపిక్స్‌కు ప్రాక్టీస్ ఈవెంట్‌గా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయింది. 1982లో ఆమ్‌స్టెర్‌డామ్‌లో టోర్నీ జరిగినప్పుడు కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. అంతకు ముందుగానీ, ఆతర్వాతగానీ భరత హాకీ జట్టు పోడియం ఫినిష్ చేయలేకపోయింది. 1982 తర్వాత ఏడు పర్యాయాలు భారత జట్టుకు మూడో స్థానం కోసం పోటీపడే అవకాశం లభించింది. కానీ, వాటిని చేజార్చుకొని, నాలుగో స్థానానికి పడిపోయింది. 2012, 2014 టోర్నీల్లోనూ భారత్‌కు నాలుగో స్థానమే దక్కింది. కాగా, 2012 ఒలింపిక్స్‌లో భారత్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఆ పరాభవం నుంచి బయటపడేందుకు రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణించాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పుడు జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో రాణిస్తే తప్ప రియోలో గట్టిపోటీనిచ్చే ఆత్మవిశ్వాసాన్ని భారత జట్టు సంపాదించుకోవడం కష్టం. ఈ టోర్నీలో భారత్ మిగతా మ్యాచ్‌ల్లో 11న గ్రేట్ బ్రిటన్‌ను, 13న బెల్జియంను, 14న దక్షిణ కొరియాను, 16న ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది.