క్రీడాభూమి

అచ్చిరాని స్టేడియంలో అగ్ని పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, జనవరి 16: అచ్చిరాని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (సీఎస్‌ఏ) స్టేడియంలో శుక్రవారం టీమిండియా అగ్ని పరీక్షను ఎదుర్కోనుంది. ఆస్ట్రేలియాను ముంబయిలో జరిగిన మొదటి వనే్డలో ఢీకొని, ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు రెండో మ్యాచ్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొంటే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోతుంది. అంతేగాక, స్వదేశంలో అజేయ జట్టుగా తెచ్చుకున్న పేరుప్రఖ్యాతులు తుడిచిపెట్టుకు పోతాయి. టీ-20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో ఆసీస్‌తో జరిగే పోరు కోహ్లీ సేనకు ఎంతో కీలకమైనదిగా చెప్పుకోవాలి. ముంబయి వనే్డలో భారత్ 49.1 ఓవర్లు ఆడి 255 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ 74, లోకేష్ రాహుల్ 47 పరుగులతో రాణించడాన్ని మినహాస్తే, టీమిండియాలో మిగతా ఎవరూ చెప్పుకోదగిన రీతిలో రాణించలేదు. మిచెల్ స్టార్క్ (56 పరుగులకు 3 వికెట్లు), పాట్ కమిన్స్ (44 పరుగులకు 2 వికెట్లు), కేన్ రిచర్డ్‌సన్ (43 పరుగులకు 2 వికెట్లు) బౌలింగ్ ధాటికి భారత బ్యాటింగ్ లైనప్ కకావికలైంది. నిజానికి భారత బ్యాటింగ్ చాలా పటిష్టమైనదే. కానీ, నిలకడలేని జట్టును తీవ్రంగా వేధిస్తున్నది. ఆ కారణంగానే ఆసీస్ బౌలింగ్ ముందు భారత్ బ్యాటింగ్ నిలవలేకపోయింది. ఈ లోపాన్ని అధిగమించి, ఎదురుదాడికి దిగితేగానీ ఆసీస్‌ను కట్టడి చేయడం కష్టం. బ్యాటింగ్‌తో పోటీపడుతూ, బౌలింగ్‌లోనూ భారత జట్టు అభిమానులను నిరాశపరచింది. ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా, 37.4 ఓవర్లలో 258 పరుగులు చేసి విజయభేరి మోగించిందంటే, భారత బౌలింగ్ వైఫల్యాన్ని అంచనా వేసుకోవచ్చు. డేవిడ్ వార్నర్ (128 నాటౌట్), ఆరోన్ ఫించ్ (110 నాటౌట్) అజేయ శతకాలను నమోదు చేసి, భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. బ్యాటింగ్‌తోపాటు నిలకడైన బౌలింగ్ కూడా టీమిండియాకు అత్యవసరమైంది. మొత్తం మీద సిరీస్ చేజార్చుకోకూడదంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ కావడంతో, రెండో వనే్డ టీమిండియాను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నది.
మరోవైపు, ఈ మ్యాచ్‌ని కూడా సొంతం చేసుకోవడం ద్వారా వనే్డ సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదల ఆస్ట్రేలియా జట్టులో కనిపిస్తున్నది. కాగితంపై సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య సమరంలో ఫలితం ఎలావున్నా, క్రికెట్ అభిమానులను మ్యాచ్ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.
''చిత్రాలు.. సీఎస్‌ఏ స్టేడియంలో శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన ఆస్టేలియా, భారత క్రికెటర్లు