క్రీడాభూమి

అలీ అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లూయిస్‌విల్లే, జూన్ 9: ‘బాక్సింగ్ లెజెండ్’ మహమ్మద్ అలీ అంత్యక్రియలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు టికెట్ల పంపిణీని కూడా అధికారులు పూర్తి చేశారు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మహమ్మద్ అలీ ఈనెల మూడో తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియలు శుక్రవారం లూయిస్‌విల్లేలో జరగనున్నాయి. అభిమానులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పోటెత్తే అవకాశం ఉన్నందున అధికారులు టికెట్లు ఉన్నవారినే అనుమతిస్తామని ప్రకటించారు. టికెట్ల పంపిణీని మొదలుకాక ముందే కౌంటర్ల ముందు భారీ క్యూలు కనిపించాయి. మొత్తం 15,000 టికెట్లను పంపిణీ చేసినట్టు అధికారులు ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హాలీవుడ్ కమేడియన్ బిల్లీ క్రిస్టల్ తదితరులు అలీ అంత్యక్రియలకు హాజరవుతారు.
ఇలావుంటే, అలీ అంత్యక్రియలకు ఏర్పాట్లు శర వేగంగా పూర్తయ్యాయ. ‘ది గ్రేటెస్ట్’కు అంతిమ నివాళులర్పించడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేస్తున్నామని లూయిస్‌విల్లే మేయర్ గ్రెగ్ ఫిచర్ తెలిపాడు. అతని భౌతిక కాయాన్ని ఆరిజోనా నుంచి లూయిస్‌విల్లేకు తీసుకొచ్చారు. గురువారం లూయిస్‌విల్లేలో అలీ భౌతిక కాయన్ని ఉంచిన శవపేటికను లక్షలాది మంది సందర్శించి మాజీ బాక్సర్‌కు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం లూయిస్‌విల్లేలో ఊరేగింపు ఉంటుంది. అక్కడి కెఎఫ్‌సి యుమ్ సెంటర్‌లో ఇస్లామిక్ మత విశ్వాసాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు. లూయిస్‌విల్లేలో జరిగే కెంటుకీ డెర్బీ రేసులకు సుమారుగా రెండు లక్షల మంది వస్తుంటారని, కాబట్టి, శాంతి భద్రతల విషయంలో తమకు చాలా అనుభవం ఉందని గ్రెగ్ ఫిచర్ అన్నాడు. అలీ అంత్యక్రియలకు ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నాడు.

చిత్రం అలీ అంత్యక్రియల టికెట్ల కోసం లూయస్‌విల్లేలో బారులు తీరిన అభిమానులు