క్రీడాభూమి

భారత్‌దే సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన చివరి వనే్డలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ (3)ను షమీ అవుట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ (19) రనౌట్ కావడంతో 46 పరుగులకే ఆస్ట్రేలియా ఓపెనర్లిద్దరినీ కోల్పోయంది. దీంతో క్రీజులోకి ఉన్న సీనియర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్మిత్ 63 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తిచేసుకోగా, లబుషేన్ 60 బంతుల్లో వనే్డల్లో తన మొదటి అర్ధ సెంచరీ సాధించాడు. అయతే కొద్దిసేపటికే రవీంద్ర జడేజా బౌలింగ్ కెప్టెన్ కోహ్లీ పట్టిన అద్భుత క్యాచ్‌తో లబుషేన్ (54) పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించా రు. ఇదే ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్ (0) పరుగు లేమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా స్మిత్ మాత్రం తన ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకుం డా ఆడుతూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. అయతే స్మిత్‌కు జతగా క్రీజులో ఉన్న వికెట కీపర్ అలెక్స్ క్యారీ (35) కొద్దిసేపు చెలరేగినా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో స్మిత్ తన వనే్డ కెరీర్‌లో 9వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయతే కొద్దిసేపటికే ఆస్టన్ టర్నర్ (4) అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆస్టన్ అగర్‌తో జతకట్టిన స్మిత్ (131) పరుగుల వద్ద షమీ చేతికి చిక్కాడు. ఆ వెంటనే ప్యాట్ కమిన్స్ (0), ఆడమ్ జంపా (1) వికెట్‌ను కూడా షమీ పడగొట్టడంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 286 పరుగులు చేసింది. ఆస్టన్ అగర్ (11), జోష్ హజెల్‌వుడ్ (1) చివరి వరకు క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో షమీకి 4 వికెట్లు పడగా, రవీంద్ర జడేజా 2, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్‌లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.
రోహిత్ సెంచరీ..
287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. అయతే లోకేష్ రాహుల్ (19) మొద టి వికెట్‌గా అవుటైనా, ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ సహకారంతో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌లో 5 పరుగుల మార్ క చేరుకోగానే రోహిత్ శర్మ వనే్డలో 9వేల పరుగులను పూర్తిచేశాడు. మరోవైపు కోహ్లీ కూడా బౌండరీలతో చెలరేగడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ దశలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్, తన దైన శైలిలో సిక్సర్లతో చెలరేగాడు. మరోవైపు విరాట్ వనే్డల్లో 57వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ (119) 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కిది వనే్డల్లో 29వ సెంచరీ కావడం విశే షం. ఆ తర్వాత కొద్దిసేపటికే జంపా బౌలింగ్‌లో స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ మిగతా బాధ్యతను తనపై వేసుకోగా, హజెల్‌వుడ్ వేసిన చక్కటి బంతికి కోహ్లీ (89) వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికే లక్ష్యానికి చేరువైన తరుణంలో మిగతా పనిని శ్రేయాస్ అయ్యర్ (44, నాటౌట్), మనీష్ పాండే (8, నాటౌట్) పూర్తి చేశారు. దీంతో మూడు వనే్డల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది.

స్కోర్ బోర్డు..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సీ) రాహుల్ (బీ) షమీ 3, ఆరోన్ ఫించ్ (రనౌట్) రవీంద్ర జడేజా/శ్రేయాస్ అయ్యర్ 19, స్టీవ్ స్మిత్ (సీ) శ్రేయాస్ అయ్యర్ (బీ) షమీ 131, మార్నస్ లబుషేన్ (సీ) కోహ్లీ (బీ) రవీంద్ర జడేజా 54, మిచెల్ స్టార్క్ (సీ) చాహల్ (బీ) రవీంద్ర జడేజా 0, అలెక్స్ క్యారీ (సీ) శ్రేయాస్ అయ్యర్ (బీ) కుల్దీప్ యాదవ్ 35, ఆస్టన్ టర్నర్ (సీ) రాహుల్ (బీ) నవదీప్ సైనీ 4, ఆస్టన్ అగర్ (నాటౌట్) 11, ప్యాట్ కమిన్స్ (బీ) షమీ 0, ఆడమ్ జంపా (బీ) షమీ 1, జోష్ హజెల్‌వుడ్ (నాటౌట్) 1.
ఎక్స్‌ట్రాలు: 27, మొత్తం: 286 (50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి..)
వికెట్ల పతనం: 1-18, 2-46, 3-173, 4-173, 5-231, 6-238, 7-273, 8-276, 9-282.
బౌలింగ్: జస్ప్రీత్ బుమ్రా 10-0-38-0, మహ్మద్ షమీ 10-0-63-4, నవదీప్ సైనీ 10-0-65-1, కుల్దీప్ యాదవ్ 10-0-62-1, రవీంద్ర జడేజా 10-1-44-2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సీ) స్టార్క్ (బీ) జంపా 119, లోకేష్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బీ) అగర్ 19, విరాట్ కోహ్లీ (బీ) హజెల్‌వుడ్ 89, శ్రేయాస్ అయ్యర్ (నాటౌట్) 44, మనీష్ పాండే (నాటౌట్) 8.
ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 289 (47.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి..)
వికెట్ల పతనం: 1-69, 2-206, 3-274.
బౌలింగ్: ప్యాట్ కమిన్స్ 7-0-64-0, మిచెల్ స్టార్క్ 9-0-66-0, జోష్ హజెల్‌వుడ్ 9.3-1-55-1, ఆస్టన్ అగర్ 10-0-38-1, ఆడమ్ జంపా 10-0-44-1, మార్నస్ లబుషేన్ 1-0-11-0, ఆరోన్ ఫించ్ 1-0-9-0.
'చిత్రం...ట్రోఫీతో భారత జట్టు