క్రీడాభూమి

అండర్-19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన కుర్రాళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లోమ్‌ఫొంటెన్, జనవరి 21: అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు అదరగొట్టా రు. మంగళవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించారు. అంతకుముందు టాస్ ఓడిన జపాన్ రవి బిష్ణోయి, కార్తీక్ త్యాగి దెబ్బకు 22.5 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. జపాన్ బ్యా ట్స్‌మెన్ల స్కోరు వరుసగా 1, 7, 0, 0, 0, 0, 0, 7, 5, 1, 1 ఉంది. జట్టు స్కోరు మొత్తంలో షు నోగూచి (7), కెంటో ఒటా డబెల్ (7)లదే అత్యధిక స్కోరు. ఇంకా విచిత్రమేమిటంటే ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన పరుగులే (19) అత్యధికం. భారత బౌలర్లలో రవి బిష్ణోయకి 4 వికెట్లు దక్కగా, కార్తీక్ త్యాగికి 3, ఆకాశ్ సింగ్ 2, విద్యాదర్ పాటిల్ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండి యా కేవలం 4.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (29), కుమార్ కుషగ్రా (13) పరుగులు చేశారు.
స్కాట్లాండ్‌పై బంగ్లాదేశ్..
మరో వరల్డ్‌కప్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన స్కా ట్లాండ్ జట్టు 89 పరుగులకే ఆలౌటైంది. సయ్యద్ షా (28). జమీ కెయన్స్ (17), అంగూస్ గై (11) మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. రకీబుల్ హసన్ 4, షాఫ్రుల్ ఇస్లాం, తంజీ మ్ హసన్ షకీబ్ లు రెండేసి, షమీమ్ హు స్సేన్, మృత్యుంజయ్ చౌ దరి ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బంగ్లా దేశ్ 3 వికెట్లు కోల్పో యి విజయం సాధించింది.

'చిత్రం... రవి బిష్ణోయిని అభినందిస్తున్న సహచర ఆటగాళ్లు