క్రీడాభూమి

కోచ్‌గా సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: టీమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ త్వరలో కోచ్‌గా కనిపించనున్నాడు. ఆస్ట్రేలియా లో కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిర్వహించే బుష్ ఫైర్ క్రికెట్ బాష్ లీగ్ లో సచిన్ కోచ్‌గా తన సేవలను అందించనున్నాడు. ఈ లీగ్ పాంటింగ్ ఎలెవన్, షేన్‌వార్న్ ఎలెవన్ జట్ల మధ్య నిర్వహి స్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) సీఈవో కెవిన్ రాబర్ట్స్ పేర్కొన్నాడు. ఇరు జట్లలో పాంటింగ్ జట్టుకు కోచ్‌గా సచిన్ ఉండగా, షేన్‌వార్న్ జట్టుకు కోచ్‌గా విండీస్ దిగ్గజ బౌలర్ కోట్నీ వాల్ష్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ చారిటీ మ్యాచ్ ఫిబ్రవరి 8న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయతే అదే రోజు బిగ్ బాష్ లీగ్ ఫైనల్‌తో పాటు ఆస్ట్రేలియా-్భరత్ మహిళల టీ20 మ్యాచ్ కూడా జరగనుంది. ఈ చారిటీ మ్యాచ్‌లో పాంటింగ్, షేన్‌వార్న్‌తో పాటు మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, బ్రెట్ లీ, అలెక్స్ బ్లాక్‌వెల్, ఆడమ్ గిల్‌క్ట్రిస్, షేన్ వాట్సన్, మైఖేల్ క్లార్క్ తదితరులు పాల్గొననున్నారు. ఇంకా వేదిక ఖరారు కాని ఈ లీగ్ వివరాలు పూర్తిస్థాయిలో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఈ లీగ్ ద్వారా సమకూరిన డబ్బులు ఆస్ట్రేలియా రెడ్‌క్రాస్ డిజాస్టర్ రిలీఫ్, రికవరీ ఫండ్‌కు చేరుతాయి.
'చిత్రం... టీమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్