క్రీడాభూమి

మాథ్యూస్ డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జనవరి 22: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఎంజిలో మాథ్యూస్ (200, నాటౌట్) డబుల్ సెంచరీకి తోడు కుశల్ మెండిస్ (80), ధనుంజయ డిసిల్వా (63), నిరోషన్ డిక్వెల్లా (63) అర్ధ సెంచరీలు సాధించడంతో జిం బాబ్వేతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు 9 వికెట్లు కోల్పోయ 515 పరుగుల వద్ద ఇ న్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు తొలి ఇన్నిం గ్స్‌లో జింబాబ్వే 358 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం లభించినట్లయంది. జింబాబ్వే బౌలర్ల లో విక్టర్ చీ, సికిందర్ రాజాల చెరో వికెట్లు తీసుకో గా, కెప్టెన్ సియన్ విలియమ్స్ 2, డోనాల్డ్ తిరిపనో 1 వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు సాధించింది. మ్యాచ్‌కు మరో రోజు మిగిలి ఉండడంతో ఫలితం తేలే అవకాశముంది.
'చిత్రం... ఎంజిలో మాథ్యూస్ (200, నాటౌట్)