క్రీడాభూమి

కోపా అమెరికా ఫుట్‌బాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, జూన్ 9: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా హైతీతో జరిగిన మ్యాచ్‌ని బ్రెజిల్ 7-1 తేడాతో గెల్చుకుంది. ఫిలిప్ కౌంటిన్హో హ్యాట్రిక్‌తో రాణించి బ్రెజిల్‌కు ఘన విజయాన్ని సాధించిపెట్టాడు. మ్యాచ్ 14వ నిమిషంలో మొదటి గోల్ చేసిన కౌంటిన్హో 29వ నిమిషంలో రెండో గోల్ చేశాడు. ఇంజురీ టైమ్‌లో మూడో గోల్‌ను నమోదు చేశాడు. రెనాటో ఆగస్టో 35, 86 నిమిషాల్లో గోల్స్ సాధించగా, బ్రెజిల్‌కు మిగతా రెండు గోల్స్ గాబ్రియెల్ (59వ నిమిషం), లూకాస్ లిమా (67వ నిమిషం) ద్వారా లభించాయి. హైతీ తరఫున మార్సెలిన్ 70వ నిమిషంలో గోల్ చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ బ్రెజిల్ ఆధిపత్యం కొనసాగితే, హైతీ ఆటగాళ్లు పూర్తిగా ఆత్మరక్షణకు పరిమితమయ్యారు.
ఈక్వెడార్, పెరూ మ్యాచ్ డ్రా
ఈక్వెడార్, పెరూ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ చేశాయి. మ్యాచ్ 5వ నిమిషంలో క్యువా, 13వ నిమిషంలో ఫ్లోరెస్ గోల్స్ చేసి, పెరూకు 2-0 ఆధిక్యాన్ని అందించారు. అయితే, 38వ నిమిషంలో వలెన్షియా, 48వ నిమిషంలో బొలానొస్ గోల్స్ చేసి ఈక్వెడార్‌ను సమవుజ్జీగా నిలిపారు. స్కోర్లు సమమైన తర్వాత ఇరు జట్లు రక్షణాత్మకంగా ఆడడంతో మరో గోల్ నమోదు కాలేదు.

చిత్రం ఫిలిప్ కౌంటిన్హో