క్రీడాభూమి

సర్ఫరాజ్ ఖాన్ ట్రిపుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంఖడే, జనవరి 22: రంజీ ట్రోఫీలో భాగంగా యూపీతో జరిగిన మ్యాచ్‌ను ముంబయి డ్రా చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి ముందు గా బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరప్రదేశ్ జట్టు 8 వికెట్లు కోల్పోయ 625 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆకాశ్ దీప్‌నాథ్ (115) సెంచరీకి తోడు వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ (203) డబుల్ సెంచరీ చేశాడు. నాలుగో రోజు బుధవారం ఆటలో మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన ముంబయి జట్టు కూడా అంతే దీటుగా బ్యాటింగ్ చేసింది.
ఓపెనర్లు విఫలమైనా సర్ఫ రాజ్ ఖాన్ (301, నాటౌట్) ట్రిపుల్ సెంచరీకి తోడు సిద్దేశ్ లాడ్ (98), కెప్టెన్, వికెట్ కీపర్ ఆదిత్య థారే (97), శామ్స్ ములానీ (65), హర్దిక్ టామోర్ (51) రాణిండంతో ముంబయి జట్టు 7 వికెట్లు కోల్పోయి 688 పరుగులు చేసింది. అయతే అప్పటికే ఆట గడు వు ముగియడంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రా చేస్తున్నట్లు ప్రకటించారు.
'చిత్రం... సర్ఫ రాజ్ ఖాన్ (301, నాటౌట్)